విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకోవటం అన్నది చాలా మంచి ఆలోచన. దానిని నిజం చేసుకోవటానికి విద్యార్థి స్టూడెంట్ లోన్ తీసుకోవటం సర్వసాధారణ విషయం. కేవలం విదేశాలలో చదవాలి అనుకుని వెళితే, పెట్టవలసినంత శ్రద్ధ చదువుపై పెట్టకపోతే మాత్రం చాలా కష్ట పడవలసి వస్తుంది. సరియైన మార్గదర్శనంతో, చిత్తశుద్ధితో చదివితే మాత్రం మిగతా జీవితమంతా నల్లేరు పై నడకే.
బ్యాంక్ లోన్ తో చదువులు:
విదేశాలలో ఉన్న విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఫాన్సీగా అనిపించవచ్చు. అంతేకాక తోటి విద్యార్థినీవిద్యార్థులు పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్ళడం కూడా ఆశను రేకెత్తించవచ్చు. అయితే అలా వెళ్ళడం మనకు ఎంత వరకూ సరియైనది అన్నది ప్రశ్న!! ఈ రోజులలో దాదాపు అందరూ చక్కని మార్కులతోటే డిగ్రీని సంపాదించగలుగుతున్నారు. వచ్చిన చిక్కల్లా విదేశానికి వెళ్లడానికి, అక్కడ ఉండటానికి, కాలేజీ ఫీజులు వంటివి చెల్లించటానికి నిధులెట్లా? వర్తమానంలో దానికీ సమాధానం రెడీగా ఉన్నది. బ్యాంక్ రుణాలు. స్టూడెంట్ లోన్స్. అమెరికా, యూరప్ దేశాలు, ఆస్ట్రేలియా ఉపఖండం ఎక్కడికైనా కావచ్చు. విద్యార్థికి అప్పు సులభంగా దొరికిపోతోంది. డేటా ప్రకారం చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో విద్యా రంగంలో మొండి బకాయిల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ డేటా ప్రకారం, విద్యా రుణాలపై డీఫాల్ట్ ల శాతం మార్చి 2016లో 7.3% గా ఉండగా, మార్చి 2018 నాటికి 9%కి పెరిగింది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ ప్రకారం, మిలియన్ల మంది విద్యార్థులు రుణ బాధితులై ఉన్నారు. గత ఏడాది చివరి నాటికి రుణాల సంఖ్య $1.6 ట్రిలియన్లకు పైగా పెరిగింది. విద్యా ఖర్చులు పెరగడంతో, రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. ముంబైకి చెందిన క్రెడిట్ బ్యూరో కంపెనీ CRIF హై మార్క్ నుండి వచ్చిన డేటా ప్రకారం, ప్రతి సంవత్సరం పంపిణీ చేయబడిన కొత్త రుణాల సగటు పరిమాణంలో పెరుగుదల నిర్ణయాత్మక రూపంలో అగుపిస్తోంది. సెప్టెంబర్ 2018 నాటికి, కొత్త ఎడ్యుకేషన్ లోన్‌ల సగటు పరిమాణం ₹8,95,000గా ఉంది, ఆర్థిక సంవత్సరం2018 చివరి నాటికి ₹7,08,000. "భారత దేశం, యువతకు మెరుగైన ఉపాధిని నిర్ధారించే మంచి విద్యకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ సమస్యల్లా విద్య ఖరీదైనదిగా మారుతోంది, అందువల్ల చాలా మంది విద్యార్థులకు రుణం అవసరం పడుతోంది.
ఇది చాలా ప్రమాదం, ముఖ్యంగా ఈ రోజుల్లో H1B వీసాలు రావడం చాలా కష్టం. H1B వీసాల కోసం అమెరికాలో లాటరీ విధానం ద్వారా ఎన్నుకోవటం జరుగుతోంది. ప్రతి సంవత్సరం 65,000 వీసాల కోసం దాదాపు 200,000 మంది వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటారు. కాబట్టి మీ అవకాశాలు ప్రస్తుతం 3లో 1గా ఉన్నాయి, వచ్చే ఏడాది నాటికి అది 4లో 1గా ఉండవచ్చు.
STEM కోర్స్ లతో:
అయితే, మీరు మీ H1B కోసం దరఖాస్తు చేసుకునే ముందు, STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్)చేత ధృవీకరించబడిన డిగ్రీని కలిగి ఉన్న ప్రతి విద్యార్థికి 17 నెలల అదనపు రెసిడెన్సీ ఉంటుంది. దాని తర్వాత 12 నెలల STEM పొడిగింపు ఉంటుంది. కాబట్టి మీ లోన్‌ని చెల్లించడానికి 29 నెలల సమయం ఉంది.
రుణాల చెల్లింపులలో ప్రతికూలత:
మీ ప్రారంభ జీతం $60,000 (ఇది అమెరికాలోని ఏ రాష్ట్రంలోనైనా, ఏదైనా STEM ఉద్యోగానికి కనీస ప్రారంభ జీతం)గా భావించి, మీరు ప్రతి నెలా $1500 (INR 90,000) ఆదా చేయగలిగితే, మీరు మీ విద్యా రుణాన్ని 29 నెలల్లోపు చెల్లించవచ్చు. తాత్కాలిక అవసరాల కోసం వీసాలను గ్రాంట్ చేస్తున్నందు వలన అమెరికాలో విద్యార్థులకు తగ్గుతున్న ఉపాధి అవకాశాలు, US కొత్త H1B వీసా నిబంధనలు వంటి కారణాల వల్ల రుణగ్రహీతలలో, రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం తగ్గిపోతోంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 65,000 వీసాల పరిమితితో పాటు, US లోని ఏదైనా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ పూర్తి చేసిన దరఖాస్తుదారులకు ప్రత్యేకంగా కేటాయించిన 20,000 వీసాలు ఉంటాయి. అయితే, H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కేవలం 2017 ఆర్థిక సంవత్సరంలో, US సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)కి 236,000 దరఖాస్తులు వచ్చాయి. కరెన్సీ విలువ తగ్గింపు, కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలలో మార్పులు USలోని భారతీయ విద్యార్థులను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. వారిలో చాలా మందికి కొన్ని సంవత్సరాలు పని చేయడం వల్ల విదేశీ విద్యపై వారి పెట్టుబడిని తిరిగి పొందడం మరింత కష్టమైంది.
ప్రలోభ పడవద్దు:
మొదటగా, విదేశాలకు వెళ్లడానికి ఇంత ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించుకోండి. తల్లిదండ్రులకు విదేశాల్లో విద్య కోసం నిధులు కేటాయించడం కష్టమవుతుందని అర్థం చేసుకోండి. ఇది వారి రిటైర్‌మెంట్ జీవితాన్ని ఇబ్బందుల పాలు జేస్తుందని గ్రహించండి.
అప్పును నివారించడానికి ఉత్తమమైన మార్గం ఆదాయాన్ని సమకూర్చుకోవటం. మీ కాలేజీ ఫీజులను మీరే చెల్లించడం. అయితే ఇది ఎల్లప్పుడూ సాధ్యం కాదు. ట్యూషన్ ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది విద్యార్థులు పూర్తి ట్యూషన్‌ను భరించేంతగా కూడా సంపాదించలేరు. కానీ ఒకటి. కొంతైనా చెల్లించడం అన్నది భారీ వ్యత్యాసాన్ని చూపుతుంది.
మీ రుణ చెల్లింపును ప్లాన్ చేయండి:
రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని విశ్లేషించుకోవటం, చెల్లింపు ప్రణాళికను స్పష్టంగా కలిగి ఉండటం ముఖ్యం. సాధారణంగా, అటువంటి రుణాలు ఐదు నుండి ఏడు సంవత్సరాల రీపేమెంట్ విండోతో వస్తాయి. మీరు మీ డిగ్రీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేస్తున్న సమయంలోనే కనీసం 12-18 నెలలకు సరిపోయేటంత రీపేమెంట్ మొత్తాన్ని పక్కన పెట్టడం దీనికి సరైన మార్గం. మీరు పని చేయడం ప్రారంభించగానే, మీ సంపాదనలో కొంత భాగాన్ని శ్రద్ధగా ఆదా చేయడం ప్రారంభింఛాలి. దీని వలన చివరి నిమిషంలో పేరుకుపోయే, అప్పులే కాక ఇతర ఖర్చులనూ నివారించవచ్చు.
విద్యార్థులకు తరగతుల తర్వాత తగినంత సమయం ఉంటుంది. ఈ సమయాన్ని విద్యార్థులు చక్కగా వినియోగించుకుంటారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల ద్వారా కొంత సంపాదించి ఉంచుకుంటారు. ఈ ఆదాయంలో కొంత భాగాన్ని, క్రమం తప్పకుండా పక్కన పెడితే, EMIలను తిరిగి చెల్లించడంలో ఉపయోగపడుతుంది. 2022 నాటికి, 43.5 మిలియన్ల మంది విద్యార్థి రుణాలను కలిగి ఉన్నారు.
మీరు ఇరుక్కుపోతే:
భారతీయ బ్యాంకులు, సంస్థలు సాధారణంగా ₹7 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలకు సెక్యూరిటీని తీసుకుంటాయి, గ్రహీత డిఫాల్ట్ అయినప్పుడు వాటిని లిక్విడేట్ చేసే హక్కును ఋణ దాతలకు ఉంటుంది. ఒకసారి మీ లోన్ నాన్-పెర్ఫార్మింగ్ అసెట్‌గా మారితే, అది మీ క్రెడిట్ స్కోర్‌పై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది, భవిష్యత్తులో మీరు రుణాలను పొందడం కష్టమవుతుంది. ఇదే పరిస్థితి ఎదురైతే, రుణదాత వద్దకు వెళ్లి, పరిస్థితిని వివరించి, చెల్లింపులను రీషెడ్యూల్ చేయడం ఉత్తమం. ప్రతి సంస్థ కూడా ఇందుకు అవకాశాన్ని ఇస్తుంది.
గుర్తుంచుకోండి, మీరు మీ రీపేమెంట్‌లను, రీషెడ్యూల్ చేస్తే మీ లోన్ కాలపరిమితి పెరుగుతుంది. EMIల రూపంలో మీరు చెల్లించే మొత్తం కూడా పెరగవచ్చు. ఆదాయం EMIలకు సరిపోలేనంత ఉన్న పక్షంలో, మీరు EMIని తగ్గించాల్సి రావచ్చు, అప్పుడు టెన్యూర్ పెరుగుతుంది.
ఉపసంహారం:
మీరు డిఫాల్ట్ అయితే మీ హామీదారు కూడా ఇబ్బందుల్లో పడవచ్చు. విద్య ఖచ్చితంగా ఉత్తమ దీర్ఘకాలిక పెట్టుబడి, కానీ మీరు విద్యా రంగంలో చెడ్డ రుణాలలో భాగం కాకుండా చూసుకోవడానికి మీ స్తోమతను ఎరిగి ఉంటూ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ విద్యను ప్లాన్ చేసేటప్పుడు వాస్తవికంగా ఉండండి. మీరు లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు అన్ని అంశాలను పరిగణించండి.
