మిస్ వరల్డ్ అనేది 1951 నుండి ఏటా నిర్వహించబడుతున్న అంతర్జాతీయ అందాల పోటీ. మిస్ వరల్డ్ CEO జూలియా ఎరిక్ మోర్లీ కాశ్మీర్‌లో ప్రెస్ మీట్‌ను నిర్వహించారు.
ఈసారి కాశ్మీర్ లో:
భారతదేశం ప్రతిష్టాత్మక అందాల పోటీల 71వ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాశ్మీర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈఓ మోర్లీ మాట్లాడుతూ, “నిజంగా కాశ్మీర్ చాలా అందంగా ఉన్నది. ఇలాంటి అందాన్ని చూడటం వలన చాలా ఎమోషనల్‌గా ఫీల్ ఔతున్నాను. డిసెంబర్ 8న, ఇక్కడే ప్రపంచ అందాల పోటీలను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నాము. తప్పకుండ ఆ రోజున మళ్ళీ కలుద్దాము” అన్నారు. అయితే ఇప్పటి వరకూ ఉన్న తాజా సమాచారం ప్రకారం వేదికపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న మిస్ వరల్డ్ 2023 పోటీల 71వ ఎడిషన్‌ను భారత్ నిర్వహిస్తోంది. అందాల భామల కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ లేక్ తో సహా శ్రీనగర్ నగరంలో టూర్ నిర్వహించారు. సందర్శిస్తున్న అందాల భామలందరినీ టూరిజం శాఖ షికారా రైడ్‌లకు తీసుకువెళ్లింది.
కాశ్మీర్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో, ప్రస్తుత మిస్ వరల్డ్ టైటిల్ హోల్డర్ కరోలినా బీల్వాస్కా మాట్లాడుతూ, “కశ్మీర్ చూసే అవకాశం కల్పించినందుకు నేను కృతజ్ఞురాలిని. ఇంతటి ఆహ్లాదాన్ని నేను అస్సలు ఊహించలేదు, కాశ్మీర్ అందాలు నన్ను కట్టిపడేశాయి.” అన్నారు.
“అందరూ మమ్మల్ని చాలా చక్కగా, చాలా ఆప్యాయంగా స్వాగతించారు. 140 దేశాల నుండి నా స్నేహితులను, వారి కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి తీసుకురావడానికి, వారికి కాశ్మీర్, ఢిల్లీ, ముంబై వంటి ప్రదేశాలను చూపించడానికి నేను నేనెంతో ఉత్సాహంగా ఉన్నాను. భారతదేశంలో ఇది నా మూడవ పర్యటన.” అని మీడియా సంస్థలతో ఆమె పేర్కొన్నారు. రూబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్‌కు చెందిన రూబుల్ నాగి, భారతదేశం చాప్టర్ PME ఛైర్మన్ జమీల్ సైదీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ అమెరికా, శ్రీ సైనీ, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్, సీఈఓ జూలియా మోర్లీ కూడా పోటీ విజేతలతో కలిసి కాశ్మీర్ టూర్ చేశారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్ ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. చివరిసారిగా 1996లో భారత్ లో ఈ ఈవెంట్‌ను నిర్వహించబడింది.
అందాల పోటీల చరిత్ర కొంత:
మిస్ వరల్డ్ పోటీని వాస్తవానికి బ్రిటన్‌లో 1951లో ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ సందర్భంగా ప్రారంభించారు. ఫెస్టివల్‌లో అంతర్జాతీయ అందాల పోటీని చేర్చాలనే ఆలోచన లండన్‌లోని వినోద సంస్థ అయిన మక్కా లిమిటెడ్, ప్రచార డైరెక్టర్ ఎరిక్ మోర్లీ నుండి మొదటగా వచ్చింది. మిస్ వరల్డ్ అంతర్జాతీయ అందాల పోటీ యొక్క అధికారిక పేరు “ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్” గా ఉండేది. అయితే, ఈ ఈవెంట్, బ్రిటిష్ ప్రెస్ దృష్టిని విస్తృతంగా ఆకర్షించింది, వారు దీనిని "మిస్ వరల్డ్" గా మార్చారు. ఆ సమయంలో బికినీని అనాగరికంగా భావించే వారి నుండి ఈ పోటీలు చాలా విమర్శలను ఎదుర్కొంది.
మిస్ వరల్డ్ వివాదం:
పోటీ యొక్క ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నప్పటికీ, అంతే వివాదాస్పదంగా కూడా అయింది. 1970 నాటి పోటీ 20వ శతాబ్దపు అత్యంత నాటకీయ స్త్రీవాద సంఘటన. పోటీ ఫైనల్ సమయంలో, కార్యకర్తలు పిండి బాంబులతో వేదికపైకి దూసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మంది ప్రజలు ఈ ఘటనను టీవీల ద్వారా వీక్షించారు.
1959 నాటికి, BBC ఈ పోటీని ప్రసారం చేయడం ప్రారంభించింది, ఇది 1960లు, 70లలో ఏటా అత్యధికంగా వీక్షించబడే కార్యక్రమాలలో ఒకటిగా మారింది. అయితే విపరీతమైన ఒత్తిడుల వల్ల అందాల పోటీలను అర్థాంతరంగా ఆపివేయవలసి వచ్చింది.
ముగింపు:
గ్రెనడాకు చెందిన జెన్నిఫర్ హోస్టెన్ టైటిల్‌ను క్లెయిమ్ చేసిన మొదటి నల్లజాతి మహిళ.
1980వ దశకంలో, "బ్యూటీ విత్ ఎ పర్పస్" అనే నినాదంతో పోటీ తిరిగి ప్రారంభం అయింది. అందము, తెలివితేటలు, వ్యక్తిత్వం వంటి ఆధారంగా ఇతర విభాగాలను, పరీక్షలను పోటీలో జోడించారు. అయినప్పటికీ, 1990ల నాటి వరకూ కూడా, ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రధాన స్రవంతి ఛానెళ్ళు అందాల పోటీలను ప్రసారం చేయలేదు.
2000లో ఎరిక్ మొర్లీ మరణించినప్పటి నుండి, ఆయన భార్య జూలియా మోర్లే ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షురాలిగా ఉన్నారు. నేపాల్‌లో జన్మించిన బ్రిటిష్ వ్యాపారవేత్త దీపేంద్ర గురుంగ్ నవంబర్‌లో కంపెనీకి కొత్త సహ యజమాని అయ్యారు.
