భారత వైమానిక దళంలో స్త్రీలు(Women in IAF in Telugu):

 పరిచయం:

భారత వైమానిక దళం (IAF)లో అగ్నివీర్ పథకం కింద కంబాట్, నాన్-కంబాట్ ఉద్యోగాల కొరకు మహిళా అభ్యర్థుల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ (MoD),  నోటిఫికేషన్ జారీ చేసింది. అగ్నివీర్ లో తమకు కేటాయించిన ట్రెయినింగును పూర్తి చేసిన తర్వాత, మహిళలు ఎయిర్‌మెన్‌గా, నాన్-కాంబాట్ ఇన్డక్షన్‌కి అర్హత పొందుతారు.

"భారతీయ వైమానిక దళ చట్టం, 1950 (45 ఆఫ్ 1950) సెక్షన్ 12 ద్వారా అందించబడిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అగ్నివీర్, వాయు(కంబాట్), అగ్నివీర్, వాయు(నాన్ కంబాట్) విభాగాలలో భారతీయ వైమానిక దళంలో నమోదు చేసుకోవడానికి మహిళలు అర్హులు. ముందుగా తమకు అగ్నివీర్ లో  కేటాయించిన పాత్రలను విజయవంతంగా పూర్తి చేయాలి.  వారి అర్హతలను బట్టి, ఇతర నిబంధనలు, షరతులను అనుసరించి వివిధ స్ట్రీమ్‌లలో, ట్రేడ్‌లలో ఎయిర్‌మెన్ నాన్-కాంబాటెంట్‌లుగా ఎంపికకు అర్హత సాధిస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ (DMA), రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా పత్రికా ప్రకటన చదవబడింది. అగ్నివీరుల మాదిరిగానే, అగ్నివీర్, వాయు నాలుగు సంవత్సరాల పాటు IAFలో నమోదు చేయబడతారు. అగ్నివీర్, వాయుకు IAFలో ప్రత్యేకమైన ర్యాంక్‌ను ఏర్పాటు చేయబడింది. 

 స్త్రీల పాత్ర:
భారత సాయుధ దళాలలోని అన్ని శాఖలలో, అధికారులుగా మహిళలు ఉన్నారు. వీరు పోరాట సేవలు, పర్యవేక్షక పాత్రలలో అధికారులుగా నియమింపబడతారు. భారత వైమానిక దళంలోని మహిళల సంఖ్య 8.50% (2014లో)13.09% (2018లో), భారత నౌకాదళం 6% (2018లో) మరియు 3% (2014లో); భారత సైన్యం 3.80% (2018లో) మరియు 3% (2014లో) శాతంగా ఉన్నారు.  
ప్రవేశర్హత:
10+2 స్థాయిలో మ్యాథ్స్ & ఫిజిక్స్ లో కనీసం 50% మార్కులు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్లు (మూడు సంవత్సరాల కోర్సు), కనీసం 60% మార్కులు లేదా తత్సమానంతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ (నాలుగేళ్ల కోర్సు) సాధించిన వారు అర్హత కలిగి ఉంటారు. కోర్సు ప్రారంభించే సమయానికి 20 నుండి 24 సంవత్సరాల వారై ఉండాలి.  DGCA (ఇండియా) జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 26 సంవత్సరాల వరకు సడలించబడింది ఈ నిబంధనలు పురుషులకు, మహిళలకు కూడా వర్తిస్తాయి. వారి పూర్వాశ్రమంలో వారు సాధించిన మెడల్స్, సర్టిఫికెట్స్, ఎన్సీసీ వంటివి పరిగణనలోకి తీసుకోబడతాయి.

భారతీయ వైమానిక దళం కీర్తిని ఇనుమడింపజేసిన మహిళల విజయ గాథలు:
 భారత వైమానిక దళం (IAF)లో ఎయిర్ మార్షల్ స్థాయికి పదోన్నతి పొందిన మొదటి మహిళ ఒకరు కాగా, ఫ్లయింగ్ ఫోర్స్ లోకి నేరుగా ప్రవేశించిన వారు మరో ఇద్దరు. ఫ్లైట్ లెఫ్టినెంట్ అవనీ చతుర్వేది, ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా ​​కాంత్. ఎంతోమంది మహిళలకు వీరు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. "యుద్ధ విమానాన్ని ఎగురవేయడం, దేశానికి సేవ చేయడం వంటి అనుభూతులను మించినవి మరొకటి లేదు" అని వారు ఏకగ్రీవంగా
అంగీకరించారు.
 భగవద్గీత శ్లోకమైన "నభః స్పర్శమ్ దీప్తం", IAF యొక్క రణనినాదం(వార్ క్రై). ఈనాటి సినిమాలు వీటిని బాగానే ప్రచారం చేశాయి.  "కీర్తితో ఆకాశాన్ని తాకండి" అన్న అర్థాన్ని ఇస్తుంది. ఈ ముగ్గురు మహిళలు దానిని పరాక్రమం తో కూడిన గౌరవంతో నినదిస్తారు. వీరి  పోరాటాలు సమయానుకూలాలను బట్టి, స్థితిగతులను బట్టి మారతాయి. వ్యవస్థ మహిళలకు మరిన్ని ప్రాముఖ్యతలను కల్పిస్తున్నది. పద్మ బందోపాధ్యాయ్ గుర్తుచేసుకున్నట్లుగా, "IAFలో నా కెరీర్ ప్రారంభం నుండి నేను పురుషులు, మహిళలు ఒకటే అని చెబుతున్నాను. మనమందరం మన దేశానికి సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాము." అన్నారు.  మన దేశం యొక్క 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, "లేడీస్ స్టడీ గ్రూప్" వర్చువల్‌గా ఈ ముగ్గురిని కలిపింది.

IAFలోకి ఎలా ప్రవేశించాను:
భావన: అందరూ జీవితంలో ఏదో అత్యున్నతమైనది సాధించాలని కోరుకుంటారు, నాకు కూడా అలాగే ఉండేది. కానీ అది సాదాసీదా ప్రయాణం ఎంత మాత్రం కాకూడదు. ఏదో ఒక రోజు సాధించాలని కలలు కన్నాను. IAF
లో చేరే అవకాశం లభించడం నా అదృష్టం.
 అవని:
నేను మధ్యప్రదేశ్‌లో పుట్టి పెరిగాను. అక్కడ పాఠశాల విద్యను అభ్యసించాను. బనస్థలి విశ్వవిద్యాలయంలో నా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసాను. నేను అక్కడ ఉన్న సమయంలోనే ఒకసారి  విమానంలో ప్రయాణించ వలసిన అవసరం వచ్చింది. అప్పుడే విమానం పట్ల ఆసక్తి పెరిగింది. నా బంధువులలో చాలా మంది డిఫెన్స్ సర్వీసెస్‌లో ఉన్నారు దానితో నాకు మార్గం సుగమం అయింది. IAFలో చేరిన తర్వాత ఇతర క్యాడెట్‌ల మాదిరిగానే, మేము ఒకే షెడ్యూల్, శిక్షణతో ముందుకు
వెళ్ళాము.
 యుద్ధానికి ఎన్నడూ ఒంటరిగా వెళ్లరు:
 అవని:
మా రోజువారీ జీవితాలు మా సహోద్యోగుల కంటే ఎంత మాత్రమూ భిన్నంగా ఉండవు. వారితో అంతే సమానంగానూ లేదా కష్టంగానూ ఉంటాయి. స్క్వాడ్‌లో సమన్వయం చాలా బాగుంటుంది. సహచరుల సహాయ సహకారాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ మన జ్ఞానాన్ని పెంచుకునే పరిధి గురించి అధ్యయనం చేయడానికి చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి  ప్రతిరోజూ చదువుకోవాలి.  ఫైటర్ ఫ్లైయింగ్ అనేది ఒంటరిగా చేయలేని పని కాబట్టి సీనియర్లతోనూ, శిక్షకులతోనూ చర్చించాలి. మీరు ఎప్పుడూ ఒంటరిగా యుద్ధానికి వెళ్లరు. ఇది ఇతర సహోద్యోగుల సమన్వయంతో కూడుకున్న చర్య.
 
భావన:
నేను అవని ఇప్పటికీ స్క్వాడ్రన్‌లో కలిసి ఉంటాము. సహోద్యోగుల చేత చేయి కలిపి,  మన దేశానికి ఇంకా ఉత్తమంగా చేయగలిగేది ఏమిటనే ఆలోచన ఎప్పుడూ కలిగి ఉంటాము. నిజానికి ఇదంతా ఒక అద్భుతమైన టీమ్ వర్క్.
 MIG-21 బైసన్‌ ను ఒంటరిగా ఎగురవేయటం:
 అవని: ఇది నాకు జీవితకాలపు జ్ఞాపకం. నా మొదటి ఎగరవేత 22 నిమిషాలు కాగా దానిలోని ప్రతి నిమిషం నాకు గుర్తుంది. ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అనుభూతీ అంతే భిన్నంగా ఉంటుంది.  సాహసోపేతమైన ల్యాండింగ్ తర్వాత ఏదో మంచి చేసిన అనుభూతి, సంతృప్తి కలుగుతుంది
. గాలిలో ఉన్నప్పుడు, మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. ఎటువంటి భావోద్వేగాలకు సమయం ఉండదు. కానీ కిందికి దిగిన మరుక్షణం అవే భావోద్వేగాలు చుట్టివేస్తాయి.

 భావన: ఏ బైసన్ పైలట్ అయినా అందులో ఒంటరిగా ఎగరడం మరువలేని అనుభూతిని కలిగిస్తుంది.  బైసన్‌లో ఒంటరిగా ప్రయాణించడానికి ముందు వేరే ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో శిక్షణ పొందుతారు. కాబట్టి మీరు బైసన్‌లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు, నిజంగా కొత్త విమానంలో ఒంటరిగా వెళ్తున్నారు. బైసన్‌లో ప్రయాణించిన ఏ ఫైటర్ పైలట్‌కైనా ఆ అనుభవం చాలా పెద్ద విషయం. ఆ మొదటిఅనుభవాన్నిఎప్పటికీ మరచిపోలేరు.
 పద్మ బందోపాధ్యాయ: నేను తిరుపతిలో పుట్టాను. ఢిల్లీలో ప్రీ-మెడ్ చదివి AFMC (ఆర్మ్ద్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ)లో చేరాను. నాకు అప్పుడు హిందీలో ఎలా మాట్లాడాలో తెలియదు. కవాతు సమయంలో, కుడి చేయి పైకెత్తవలసి వచ్చినప్పుడు ఎడమ చేతిని పైకి లేపేదానిని. నెమ్మదిగా అన్నీ నేర్చుకున్నాను. నాకు అప్పటికి, విమానం ఎగరుతూ ఉండటం చూడటం చాలా ఇష్టం. ఆ కోరికే నన్ను వైమానిక దళంలో డాక్టర్‌గా చేరడానికి ప్రేరేపించింది. నేను ఫ్లైయింగ్ కోసం దరఖాస్తు చేసాను, కానీ వారు నన్ను అన్‌ఫిట్ చేసారు. ఈ విషయంగా కోపం ప్రదర్శించాను. అప్పటికే ఏవియేషన్ మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాను. అలా చదివిన మొదటి మహిళ నేనే.

ముగింపు:
 సాయుధ దళాలలో పదోన్నతులు చాలా కష్టం. అసాధ్యం మాత్రం కాదు. ఇందులో స్త్రీ పురుషులంటూ మినహాయింపులు ఏవీ ఉండవు. ఇక్కడ సీనియారిటీ, ప్రతిభా వంటివి పరిగణనలోకి తీసుకోబడతాయి. 

మొదటి మహిళా ఎయిర్ మార్షల్ కావడం ముఖ్యం కాదు.  సహచరులు, భారత వైమానిక దళానికి చెందిన కుటుంబం, వారి వారి కుటుంబాల సహకారం కూడా మరువలేనిది. స్క్వాడ్రన్‌లో ఉన్నంత ఐక్యత మరెక్కడా ఉండదు. ఈ యూనిఫాంలో గడుపుతున్న జీవితం, మీరు ఇక్కడ పొందే కుటుంబ అనుభూతి అపూర్వం. మనమంతా ఒక్కటే. మనది నిజమైన సెక్యులర్ భారతదేశం! తోటి దేశస్థుల ప్రేమ, మద్దతు ఎన్నటికీ నిలిచి ఉంటుంది. చివరిగా ఒకమాట. “యూనిఫాం ధరించడం గొప్ప అనుభూతి. ఈ అదృష్టం అందరికీ ఉండదు.

ఇక్కడొక విషయం. మహిళలు సైన్యంలో వివిధ స్థాయిలలో జాయిన్ కావటానికి సినిమాలు, వార్తలు, సంబంధిత వీడియోలు కూడా కారణంగా పరిగణింపబడుతున్నాయి.