జాతీయ చేనేత దినోత్సవం.(JATHIYA CHENETA DINOTSAVAM. NATIONAL HANDLOOM DAY IN TELUGU):

 పరిచయం:

చేనేత పరిశ్రమ భారతదేశానికి ఆత్మ.  మన దేశపు వైవిధ్యభరితమైన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. దేశంలోని గ్రామీణ, పాక్షిక గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధి కోసం ఈనాటికీ ప్రజలు చేనేతనే ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మొత్తం నేత కార్మికులు, అనుబంధ కార్మికులలో 70% మంది మహిళలు ఉన్నారు. మహిళల సాధికారతను కాపాడే రంగం చేనేత. చేనేత ప్రకృతి ప్రసాదించిన వరం.  కనీసపు పెట్టుబడితో పూర్తిగా పర్యావరణ అనుకూల ఉత్పత్తి ప్రక్రియలను ఉపయోగించి వస్త్రాలను తయారుచేయవచ్చు. సరికొత్త ఫ్యాషన్ పోకడలు, వేగంగా మారుతున్న కస్టమర్ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగా కొత్త కొత్త ఆవిష్కరణలను చేయవచ్చు.


1905 ఆగస్టు 7న ప్రారంభించబడిన స్వదేశీ ఉద్యమం, దేశీయ పరిశ్రమలను మరీ ముఖ్యంగా చేనేత కార్మికులను ప్రోత్సహించింది. 2015లో, భారత ప్రభుత్వం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని 7 ఆగస్టు, 2015న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో ప్రారంభించారు.

 జాతీయ చేనేత దినోత్సవానికి మద్దతు ఇవ్వడానికి చేయగలిగే గొప్ప పని ఏమిటంటే, చేతితో తయారు చేసిన వస్తువులను  మాత్రమే కొనుగోలు చేయడం. ఎక్కువ మంది కార్మీకులకు మద్దతు ఇవ్వడం. నేత కార్మికులను ప్రోత్సహించడానికి వినియోగదారులు జాతీయ చేనేత దినోత్సవం రోజున చేతితో నేసిన వస్త్రాలను కొనుగోలు చేయాలి.
 
జాతీయ చేనేత దినోత్సవం. ప్రాముఖ్యత:
జాతి నిర్మాణంలో చేనేత సంఘం పోషించే పాత్ర గురించి అవగాహన కల్పించడంలో, మన దేశ సామాజిక, ఆర్థిక పురోగతిపై ఈ రంగం ప్రభావాన్ని నొక్కి చెప్పడంలో ఈ రోజు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతదేశంలోని చేనేత పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది. మన దేశం యొక్క సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. అంతే కాదు. జాతీయ ఆదాయానికి ముఖ్యమైన వనరుగా నిలుస్తుంది. నేత నేయడం, సంబంధిత పాత్రలలో 75% కంటే ఎక్కువ శ్రామికశక్తిని మహిళలు కలిగి ఉండటంతో, మహిళా సాధికారతలో పరిశ్రమ కీలకమైన శక్తిగా మారింది. ఈ సందర్భంగా, దేశ సామాజిక-ఆర్థిక పురోగమనానికి వారి సహకారాన్ని గుర్తు చేసుకుంటూ ఈ చేనేత దినాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం.

 కొంత వెనక్కి:
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆగస్ట్ 7, 1905న ఉద్భవించిన స్వదేశీ ఉద్యమం గణనీయమైన ప్రభావాన్ని చూపింది. దేశీయ ఉత్పత్తులను పెంపొందించడం, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఉద్యమ ప్రధాన లక్ష్యం. ఇది దేశవ్యాప్తంగా గృహాలలో ఖాదీ వస్త్రాన్ని విస్తృతంగా స్వీకరించడాన్ని స్వాగతించింది. ఈ సంధర్భంగా ఇండియా గేట్ సమీపంలోని ప్రిన్సెస్ పార్క్ వద్ద జవహర్‌లాల్ నెహ్రూ ఖాదీతో చేసిన భారతీయ జెండాను ఎగురవేశారు.
ఆనాటి ఆగష్టు 7నాటి స్వదేశీ ఉద్యమం, నేటి జాతీయ చేనేత దినోత్సవానికి హోదాను కల్పించి, తగిన
ప్రాముఖ్యతను ఇచ్చింది.
 జాతీయ చేనేత దినోత్సవం లక్ష్యం:

జాతీయ చేనేత దినోత్సవం చేనేత కార్మికులను గౌరవించడమే కాకుండా, ఈ రంగంలో ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా పరిష్కరిస్తుంది. పేలవమైన మౌలిక సదుపాయాలు, కాలం చెల్లిన మరమగ్గాలు, ప్రధాన మార్కెట్‌ లు అందుబాటులో లేకపోవడం వంటి సవాళ్లను కూడా పరిష్కరిస్తుంది. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల సహకారంతో చేనేత ఉత్పత్తులకు డిమాండ్‌ని పెంచడానికి ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుంది.
 
జాతీయ చేనేత. ప్రజల బాధ్యత:
జాతీయ చేనేత దినోత్సవం కోసం, ప్రజలు భారతీయ కార్మికులు సృష్టించిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. సన్నిహితులను చేనేత ఉత్పత్తులను కొనే వైపుగా ఉత్సాహ పరచాలి.
 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, నగరంలోని ఏదైనా హ్యాండ్లూమ్ ఫెయిర్‌ను సందర్శించడం ద్వారా లేదా ఆన్‌లైన్ ఈవెంట్‌కు హాజరు కావడం ద్వారా సమయాన్ని వెచ్చించవచ్చు.
నేత కార్మికులకు మద్దతు ఇవ్వవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లకు తప్పకుండ  హాజరు కావాలి. ఇది సంబంధిత కార్మికులకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది.
కొంత కంట్రిబ్యూటర్ పనిని కూడా చేయవచ్చు. స్థానిక నేత కార్మికుడికి కొంత డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు. ముడి సరుకు, మార్కెట్ యాక్సెస్‌ను పొందడంలో వారికి సహాయపడవచ్చు.
భారతీయ చేనేత గురించి అవగాహన కలిగి ఉండటం:
సోషల్ మీడియా ఉనికిని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ జాతీయ చేనేత దినోత్సవంపై అవగాహన కల్పించవచ్చు. ఫ్యాక్టరీ వస్తువుల కంటే చేనేత ఉత్పత్తులు ఎందుకు మెరుగ్గా ఉన్నాయో
సహచరులకు వివరించి చెప్పడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 ముగింపు:
వ్యక్తిగత చేనేత బోర్డులను మూసివేయాలని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాలనను మరింత హేతుబద్ధీకరించడానికి విధాన నిర్ణయాలలో పరదర్శకతను ప్రదర్శించడానికి ప్రాధాన్యతను చూపింది.