భారతీయులు సైన్యంలో చేరేందుకు ఎందుకు ఇష్టపడతారు?(Why Indians like to join Army?):

 ప్రారంభం:

రక్షణ దళాలలో చేరాలని ఆకాంక్షించే యువతలో భారతీయ సాయుధ దళాలు ఎల్లప్పుడూ ఆకర్షణీయమైన కెరీర్ ఎంపిక. దీనిని సాకారం చేసుకోవటానికి పట్టణ, గ్రామీణ యువత ఎప్పుడూ కూడా తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకోవటానికి వెనుకాడరు. సాయుధ దళాలలో చేరటం అన్నది యువతకు సమాజంలో ఎనలేని గౌరవాన్ని, మర్యాదను తెచ్చిపెడుతుంది. 1999 లో జరిగిన చివరి యుద్ధం తరువాత సాయుధ దళాలలో సమూలమైన మార్పు కనిపించింది. భారత్ యొక్క ప్రథమ మరియు ప్రధాన ప్రత్యర్థులు పాకిస్తాన్, చైనాలు మాత్రమే. పాకిస్తాన్ మరియు చైనాల మధ్య అణు సంబంధిత ఒప్పందాలు ప్రధాన యుద్ధం యొక్క సంభావ్యతను తగ్గించింది. అయితే అదే సమయంలో యుద్ధం అన్నది జరగక పోయినా ఆ స్థాయి బలవంతపు సైనిక ప్రాముఖ్యతను ఒకవైపు పెంచగా, మరొక వైపు బలవంతపు చొరబాట్లు పెరిగినాయి. చైనా సైన్యం యొక్క అసాధారణ ఆధునికీకరణ భారతదేశాన్ని తమ భూ సరిహద్దులోనే కాకుండా, హిందూ మహాసముద్రం మరియు అంతరిక్షం మరియు సైబర్‌స్పేస్ వంటి కొత్త డొమైన్‌లలో కూడా సవాల్ గా మారింది. అధునాతన సైనిక సాంకేతికతలు సమకాలీన సంఘర్షణ స్వరూప స్వభావాలను సమూలంగా మారుస్తున్నాయి ఎవరు చేరవచ్చు.


ఆశావహులు గ్రాడ్యుయేట్లు అయి ఉండాలి మరియు వారు IMA (ఇండియన్ మిలిటరీ అకాడమీ)కి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే వారు 19-24 సంవత్సరాల వయస్సు గలవారై ఉండాలి. 18-25 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు కూడా OTA (ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టులో మొత్తం 45%, 33%తో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మరియు ఇంగ్లీషులో మొత్తం 50% మార్కులతో మరియు ప్రతి సబ్జెక్టులో 40% మార్కులతో 10+2/ఇంటర్మీడియట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారు ప్రథమ అర్హత సాధించిన వారౌతారు. భారత సాయుధ దళాలు దేశం యొక్క సేవ, దేశభక్తి మరియు మిశ్రమ సంస్కృతి యొక్క ఆదర్శాలకు ప్రతీక. సాయుధ దళాలకు రిక్రూట్‌మెంట్ స్వచ్ఛందంగా ఉంటుంది. కుల, తరగతి, మతం, కమ్యూనిటీలతో ఎంత మాత్రమూ సంబంధం లేకుండా భారతదేశంలోని యువపౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. సైన్యం అన్నది శారీరక దారుఢ్యనికి సంబంధించిన విషయం కాబట్టి నిర్దేశించిన భౌతిక, వైద్య మరియు విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. మధ్యతరగతి వారే ప్రాధాన్యత ఎందుకు చూపుతారు? ఒక మధ్యతరగతి విద్యార్థి సాధారణంగా చాలా లేత వయస్సులో వివిధ కష్టాలను అనుభవిస్తాడు. ఒక స్థిరమైన  జీవనోపాధి పొందడం ఎంత ముఖ్యమో అతనికి తెలుసు.మధ్యతరగతి విద్యార్థి తన కుటుంబం యొక్క అన్ని కష్టాలను అంతం చేసి వారికి సురక్షితమైన, రక్షిత భవిష్యత్తును అందించాలని కోరుకుంటాడు. అందుకు ఆర్మీయే ప్రత్యామ్నాయం. అంతర్లీనంగా దాగిఉన్న మరొక కారణం సమాజం నుండి గౌరవం ఆశించడం, అతను తనకు మరియు తన కుటుంబ సభ్యులకు సంఘంలో గౌరవాన్ని సంపాదించాలని కోరుకుంటాడు.

ప్రయోజనాలు:

నిజానికి మిలిటరీ కెరీర్ వృద్ధి మరియు పురోగతికి వివిధ అవకాశాలను అందిస్తుంది, అలాగే మంచి వేతనంతో పాటు వివిధ ప్రయోజనాలతో కూడిన, స్థిరమైన మరియు సురక్షితమైన ఉద్యోగాన్ని అందిస్తుంది. దీనికి అదనంగా లభించే మరొక లాభం, భారతీయ సమాజంలో సైన్యాన్ని గౌరవప్రదమైన వృత్తిగా చూస్తారు. చాలా మంది మధ్యతరగతి విద్యార్థులు తమ దేశానికి సేవ చేయడానికి, దేశ భద్రత మరియు అభివృద్ధికి దోహదపడే మార్గంగా తనను తాను చూసుకోగలుగుతాడు. భారతదేశంలో, సాయుధ దళాలను ప్రతిష్టాత్మకమైన కెరీర్ ఎంపికగా పరిగణిస్తారు. చాలా మంది విద్యార్థులు తమ తమ కమ్యూనిటీలలో ప్రతిష్ట మరియు హోదాను పొందేందుకు సైన్యంలో చేరాలని కోరుకుంటారు.సమాజంలో ఒకరికి ఇటువంటి స్థితిని మరే ఉద్యోగమూ అందించదు. సైనికాధికారికి ఉండే గౌరవం సాటిలేనిది.

అత్యున్నత జీవన ప్రమాణాన్ని కలిగి ఉండటానికి సైన్యం ఆకర్షణీయమైన జీతభత్యాలను చెల్లిస్తుంది. ఉద్యోగ సంస్కృతి, సామాజిక మర్యాదలు, రాజరిక ఆచారాలను, ఎనలేని క్రమశిక్షణను ఇక్కడ  నేర్చుకుంటారు. సైనికుడిపై ఆధారపడిన వారికి కూడా వైద్య సేవలు, క్యాంటీన్ సౌకర్యాలు మొదలైన ప్రయోజనాలను అందిస్తుంది 

ధనిక వర్గం నుండి యువతీ యువకులు ఆర్మీలో చేరటం లేదన్నది అబద్ధం. ఎంతోమంది సాయుధ దళాలలో ఇప్పటికే చేరారు. ఇంకా ఎంతోమంది ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నారు.


మహిళలకు సురక్షితమైన ప్రదేశం: 

ఇతర ఉద్యోగాలతో పోలిస్తే భారతీయ సైన్యం బాలికలకు అత్యంత సురక్షితమైన ప్రదేశం. వేరే ఉద్యోగాల్లో తమ సేవలనందిస్తున్న బాలికలకు లేదా మహిళలకు వివిధ భద్రతా సమస్యలు ఉన్నాయి. కానీ భారత సైన్యంలోని సైనికులందరూ ఎంతో ఉన్నతమైన మనస్తత్వం తమ శిక్షణ ద్వారా పొంది ఉంటారు. అందులో మొదటిది సాటి మహిళా అధికారులను గౌరవంగా, మెరుగ్గా చూడటం. లైంగిక వేధింపులు, ఇతర వెకిలి మాటలు లేదా చేష్టలు ఎదుర్కొనరు. సమానమైన పని సమానమైన వేతనం. లింగ భేదం లేదు. లింగాధారంగా వివక్ష ఉండదు. కఠినమైన శిక్షణ ఇస్తారు. కఠినమైన వాతావరణం, భూభాగంలో నియామకాలు జరుగుతాయి.

సైన్యం మహిళా అధికారులను సరిహద్దుకు పంపదు. తిరుగుబాటుదారులతో పోరాడటానికి దళాలతో పాటు పంపబడరు. మహిళా అధికారులు ఆయుధాలు, సాయుధ వాహనాలు మరియు ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ వాహనాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. ఇందులో అధునాతన రాడార్ జామర్‌లు మొదలైనవి ఉన్నాయి. అలాగే మహిళా అధికారులు బాలిస్టిక్ మిస్సైల్ లాంచ్ వెహికల్స్, SLVలు మొదలైన వాటితో పనిచేస్తున్నారు. మహిళా అధికారులకు ఆర్మీ సురక్షితమైన ఎంపిక. 

అగ్నిపథ్: 

భారతీయ సాయుధ సేవల్లో, "టూర్ ఆఫ్ డ్యూటీ" అనే పేరు మీద కొత్త పథకాన్నికేంద్రం ప్రారంభించింది. క్యాబినెట్ కమిటీ మే 14, 2022న “అగ్నీపథ్” అని పిలువబడే ప్రయోగాత్మక కార్యక్రమానికి మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యం, భారత నౌకాదళం లేదా భారత వైమానిక దళం అనే తేడా లేకుండా ఈ సరికొత్త అవకాశం ద్వారా సాయుధ సేవల్లో చేరాలనుకునే యువతీ యువకులకు(అగ్నివీర్) అగ్నిపథ్ పథకం అందుబాటులో ఉంటుంది. భారత ప్రభుత్వం అగ్నిపథ్ “ఆర్మీ భారతి” పథకాన్ని దరఖాస్తుదారులందరికీ అందుబాటులో ఉంచుతుంది.



అగ్నిపథ్ ద్వారా పోరాట దళంలో చేరవచ్చు మరియు ప్రతి సంవత్సరం 45,000 నుండి 50,000 మంది సైనికులు నాలుగు సంవత్సరాల నిబద్ధతతో కూడిన రిక్రూట్మెంట్ చేయబడతారు. సైన్యంలో చేరాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన గేట్వే. ఈ వ్యాసానికి సంబంధించి అగ్నివీర్ యొక్క వివరాలు ఇవి సంతృప్తికరం. మరొక వ్యాసంలో అగ్నిపథ్ గురించి వివరంగా చర్చిద్దాం.  

ముగింపు:

 లింగబేధం లేకుండా, ధనిక, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అనే కాకుండా కులం, మతం, ప్రాంతం వంటి వాటితో ఎంతమాత్రం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సమానమైన గౌరవ మర్యాదలు, వేతనం, ఇతర సౌకర్యాలు స్థాయిలను బట్టి ఉంటాయి. సాయుధ దళాలలో చేరటం అన్నది రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. అత్యంత గౌరవ మర్యాదలతో కూడిన ఉపాధి మరియు దేశ సేవ!!