టీవీలో ప్రకటనలు, సమాజంపై వాటి ప్రభావం. (TV prakatanalu, bharateeya samajampai vati prabhavam) (TV ADS AND THEIR EFFECTS ON SOCIETY IN TELUGU)
ప్రారంభం:
ఆర్ట్ లేదా కళ ఎంతో అందమైనది. అంతే ప్రమాదకారి.". అన్నది తాత్వికవేత్త ప్లేటో ప్రసిద్ధ వచనం. టీవీలో వచ్చే ప్రకటనలు కళ కోవ కిందికే వస్తాయి. ఈ ప్రకటనల వల్ల మనకి కొత్త విషయాలు, మార్కెట్లోకి వచ్చిన కొత్త కొత్త ప్రోడక్ట్ ల గురించి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఆ విధంగా మనం అప్డేట్ అయి ఉంటాం. ఇది ఒక కోణం. రెండవది సూటిగా మన కుటుంబం పైన ముఖ్యంగా పిల్లల పైన తద్వారా మిగతా సమాజానికి నకారాత్మక సందేశం వెళుతుంది.సులభంగా దొరికేది ఎవరు?:
పిల్లలు నేటి సమాజంలో 7 సంవత్సరాలు వచ్చే వరకూ కూడా పెద్దలు చెప్పినాదాన్ని విని నేర్చుకోవటం కన్నా, అనుసరించడం చేస్తారు. మీరు ఫలానాది చేయటం తప్పు అని చెప్పండి. వారికి అర్థం కాదు. అదే మీరు పిల్లలు చూస్తున్నప్పుడు ఆచరించి చూపండి. వాళ్ళు వెంటనే గ్రహించి అట్లాగే చేస్తారు. ఈ సమయంలోనే టీవీ కమర్షియల్స్ వారిని టార్గెట్ చేస్తాయి. ఇందువల్ల వారికి టీవీలో చూపిన వస్తువు ఎట్టి పరిస్థితులలోనూ కావాలని మంకు పట్టు పడతారు. అది దొరకకపొతే భద్రతా భావాన్ని(Insecurity) కోల్పోతారు. ఇది చాల ప్రమాదకరం. ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ రకమైన మార్పు 7 సంవత్సరాల లోపు పిల్లల పై గమనించడం జరిగింది. సాధారణంగానే ఆ వయసు పిల్లలలో మంకుతనం విపరీతంగా ఉంటుంది. దానికి ఈ యాడ్స్ తోడైతే పరిస్థితి చెప్పనవసరం లేదు. ఆ దంపతుల కష్టాలు మామూలుగా ఉండవు.
మెన్ విల్ బీ మెన్:
ఈ కమర్షియల్స్ మనని మనం పోల్చుకునేటట్టు చేస్తాయి. అంటే కొంచం ట్రిక్కీగా ఉంటాయి.
ఇంపీరియల్ బ్లూ(Imperial blue) వారి మెన్ విల్ బీ మెన్(Men will be men) యాడ్స్ చూసే ఉంటారు. ప్రతి మధ్యతరగతి పురుషుడు దానితో, తనని పోల్చుకుంటాడు. ఆ క్యాంపెయిన్ చాలా పెద్ద హిట్ ఐంది.
హీరో హొండా మోటార్ సైకిల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు "ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గెట్ ఇట్" అన్న యాడ్ రిలీజ్ చేసారు. అది జనంలోకి చొచ్చుకొని పోయింది. అంతవరకూ ఉన్న బజాజ్ చేతక్ అమ్మకాలను విపరీతంగా ప్రభావితం చేసింది. మహిళలను టార్గెట్ చేసే పద్ధతి:
స్త్రీలు కూడా "సాఫ్ట్ టార్గెట్" లు గా మారుతారు. వారి అహం మీద, వారి అందంపైన యాడ్స్ చేయటం వల్ల ఎంతో ఆత్మన్యూనత కు లోనవుతున్నారు. దానివల్ల వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. నలుగురూ తనని చూసి నవ్వుతున్నారు అన్న భావన పెరుగుతుంది. ఆడపిల్ల చామనఛాయ(Wheatish complexion) గా ఉండటం ఆమె చేసుకున్న తప్పు అన్నది సూత్రీకరించేసాయి కంపెనీలు.తమ కంపెనీ క్రీమ్ రాసుకుంటే తెల్లగా అవుతారు అని ఒక మాస్ హిప్నాటిజం కి స్త్రీలను గురి చేస్తున్నారు. చాలా మంది ఈ ట్రాప్ లో పడుతున్నారు.కూడా.
సుష్మిత సేన్, ఐశ్వర్య రాయ్ ప్రపంచ సుందరి కిరీటాలను(Beauty Pageant) పొందినప్పటి నుండి ఈ ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. హిస్టీరిక్ గా మహిళలు బ్యూటీ ప్రోడక్ట్స్ ని కొనటం ప్రారంభించారు.అంతకు పూర్వం ఇటువంటి ధోరణి చాలా తక్కువగా ఉండేది. బ్రాన్డెడ్ వస్తువులు తీసుకోవటానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలలో వెల్లడి ఐంది.దీని వలన రాబడికి, కొనుగోలు శక్తికి మధ్య అగాధం ఏర్పడింది. పర్యవసానంగా పోలిక దాని వల్ల డిప్రెషన్ వంటివి వస్తున్నాయి.
ఇది అంతా కూడా ఒక చెయిన్ సిస్టం. వస్తువు తయారీ దగ్గర నుండి ఎండ్ యూసర్ ని చేరేవరకూ కూడా మొత్తం మార్కెటింగ్ మాయాజాలం,. ఏ సమయంలో నైనా తినే పదార్థాలు మన ఇంటి వద్దకే తీసుకుని వచ్చే యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంత అర్థరాత్రి అయినా సరే. బర్గర్, పిజ్జా, కూల్ డ్రింక్స్ వంటివి మన దేశ కాల మాన పరిస్థులకు సరిపడవు అని అందరికీ తెలుసు. అందులో వాడే పదార్థాలు ఏవో వారు చెప్పరు. తమ సీక్రెట్ అని చెప్పుకుంటారు. అయినా భారత్ లో కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి. ఊబకాయం, చక్కెర వ్యాధి ఇంకా ఇతరాలు అనేకం మనని ఆవహిస్తాయి. అయినా వాటిని వదలలేక పోతున్నాం,. కారణం కేవలం మార్కెటింగ్. అడ్వేర్టైజింగ్.
చిత్రమేమంటే మీ ఊబకాయానికి, ఆరోగ్యానికి మూల సూత్రమైన "ఓట్స్" అమ్మేదీ ఈ కంపెనీలే. కెల్లాగ్స్, క్వాకర్, స్టీల్ కట్, వంటి బ్రాండ్ పేర్లతో మనకి ఆరోగ్యాన్ని ప్యాకెట్లలో పెట్టి అమ్ముతారు. సందేహం లేకుండా రెండూ సమానమైన గిరాకీని కలిగి ఉంటాయి.
వర్తమానంలో దంతెరాస్ నాడు ఒక చిన్న ముక్క బంగారమైనా తీసుకుని ఇంటికి రావాలి అన్న ధోరణి ప్రతి ఇంట్లోనూ ఉన్నది. ఈ విషయం మూలమూలలో ఉన్న కుటుంబాలకు ఎట్లా చేరింది? ఆనాడు బంగారం కొనకపోతే ఏదో జరిగిపోతుంది అన్న భావన ప్రజలలో ఏ విధంగా కలిగింది? దీనికి మార్కెట్ ని స్టడీ చేసిన సంస్థలు మాస్ హిస్టీరియా అని అన్నాయి. ఇందులో ఎవరి తప్పూ లేదు. బంగారం షాపు వారు తమ బంగారాన్ని అమ్మటానికి చూస్తారు. సహాయం చేయమని యాడ్ ఏజెన్సీ ని కలుస్తారు. వారి పని వారు చేస్తారు. ఫ్యాన్సీగా ఉండే పనులను చేయటానికి ఇష్టపడే మధ్యతరగతి జీవులు, పై రెండు కంపెనీల ట్రాప్ లో పడిపోతారు. ఎవరి పని వారు చేస్తున్నారు.
అవసరం లేకున్నా క్రెడిట్ కార్డులను అంటగట్టండం, అప్పులు చేయించడం కూడా ఈ స్ట్రాటజీలో భాగమే. ఏదో కొనెయ్యాలనే భావన మనకి కలిగించడం లో ఆయా యాడ్ ఏజెన్సీలు విజయం సాధిస్తున్నాయి. ప్రత్యక్షం గానో, పరోక్షంగానో మన జేబులోని డబ్బు వారి ఖాతాలో జమ కావాలి. నిజానికి ఇంటికి ఏమాత్రం అవసరం లేని వాసస్తువులను కూడా కొనేస్తున్నారు.
నిజానికి ప్రకటనలు మాత్రమే కాదు. టెలివిజన్ అన్న యంత్రమే ప్రధానంగా హాని చేస్తోంది.
మొదటగా పిల్లల చదువులకు పెద్ద ఆటంకంగా మారుతుంది.
పిల్లలు తమకు అనవసరమైన జ్ఞానాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది.
సమయం ఎంతో వృధా అవుతుంది.
తీవ్రమైన హింస మరియు సెక్స్ సన్నివేశాలు ప్రభావితం చేస్తాయి.
ఒబెసిటీ వంటి శారీరక సమస్యలు వస్తాయి.
సమాజం నుండి, కుటుంబం నుండి వేరు చేయబడతారు.
:ముగింపు:
ఇవి కొన్ని మాత్రమే. చెప్పుకుంటూ పొతే చాలా సమస్యలు ఉన్నాయి. సరే టీవీ అన్నది ప్రతి ఇంటిలోనూ తప్పదు. అది ప్రస్తుతం ఒక ప్రాథమిక వినోద సాధనం కాబట్టి. దానిని మన నుండి వేరు చేయలేము. వేరుగా చూడలేము.
ఒక టీవీ గురించి ప్రకటనే రానివ్వండి. వెంటనే మన ఇంటిలో ఉన్న టీవీతో పోల్చుకుని చూస్తాం. ఈ ధోరణి మనకు సెల్ ఫోన్ లలో విరివిగా అగుపడుతుంది. కొత్త ఫీచర్స్ తో వచ్చిన ఫోన్ ను మన ఫోన్ తో పోల్చి చూసుకోవటం.
ఇలా మనకు అవసరం లేని వస్తువును మానను మభ్య పెట్టి మరీ మనతో కొనిపించి. నిజంగా ఇంటికి అవసరమైన వస్తువును మళ్ళీ కొందాంలే అని అనిపించేలా చేసే యాడ్ ల మాయాజాలం లో పడకుండా తప్పించుకుని చక్కగా కాలం వెళ్లదీయగల వ్యక్తి ఈ రోజులలో మహానుభావుడు.

