అత్యంత పురాతనమైన భారతీయ వ్యాపారాలు.(Old Indian Businesses in Telugu):

 పరిచయం:

భారతదేశపు వ్యాపార భావన ప్రారంభ యుగం నుండి గుర్తించబడింది. హరప్పా నాగరికత, మట్టి బొమ్మలు, మట్టి కుండలు, లోహపు పాత్రలు ఇతరత్రా చేతితో తయారు చేసిన ఉత్పత్తులను మార్పిడి చేసుకునేవారు. వ్యాపార సంస్కృతి కారణంగా మెసొపొటేమియా సమాజంతోభారత్ ప్రాచీన కాలంలో వాణిజ్య సంబంధాన్ని ఏర్పరుచుకుంది. ఇది వస్తుమార్పిడి వ్యవస్థగా పిలువబడింది(Barter system). అవసరమున్న వస్తువు కొరకు దగ్గరున్న వస్తువుతో మార్పిడి చేసుకోవటం.  ఇది డబ్బు   కనిపెట్టబడకముందు అత్యంత ప్రబలంగా ఉండేది.


కాలక్రమేణా, వ్యాపారం, వాణిజ్యం అభివృద్ధి చెందాయి.  పాశ్చాత్య ప్రపంచంతో సంపర్కానికి ముందు  భారతీయులు సామాజికంగా నిర్దిష్ట రూపంలో ఉండేవారు.

ప్రైవేట్ రంగ పరిశ్రమలను స్థాపించడం ద్వారా భారతదేశంలో పరిశ్రమ సంస్కృతిని పరిచయం చేసింది బ్రిటిష్ వారు. చాలా మంది భారతీయ పారిశ్రామికవేత్తలు ఆ సమయంలో వ్యాపారాలను స్థాపించారు, అవి నేటికీ విజయవంతంగా కొనసాగుతున్నాయి,

కాలక్రమేణా, వ్యాపారం, వాణిజ్యం అభివృద్ధి చెందాయి.  పాశ్చాత్య ప్రపంచంతో సంపర్కానికి ముందు  భారతీయులు సామాజికంగా నిర్దిష్ట రూపంలో ఉండేవారు

జెస్సోప్ అండ్ కంపెనీ, బాంబే డైయింగ్, డాబర్ వంటి కంపెనీలు 17&1800ల ప్రారంభంలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. శతాబ్దాల పాటు విజయవంతంగా తమ మనుగడ సాగిస్తున్నాయి. ఈ కంపెనీలు నిస్సందేహంగా తోటి వ్యాపారాలకు నిజమైన ప్రేరణగా నిలుస్తాయి. 

ప్రస్తుత వ్యాపార విభాగంలో తమను తాము విస్తృత పరచుకోగల అత్యంత పురాతన వ్యాపార ఆలోచనలఐదింటినిఇక్కడ వివరించడం జరిగింది.

కుండల తయారీ:
ఈ ఆలోచన సింధు నాగరికతకు చెందినది. ఎందుకంటే కుండల తయారీ భారతీయుల పురాతన నైపుణ్యాలలో ఒకటి. ఈ పరిశ్రమకు ఇప్పటికీ కూడా ఒక బ్రాండ్ గా గుర్తింపు లేదు. అయినప్పటికీ భారతీయ గ్రామాలలో, పట్టణాలలోఈ నాటికీ నిత్యవసర వస్తువుగా, అలంకరణ వస్తువుగా మొదటి స్థానంలో నిలిచి ఉంది. భారతదేశం కుండలు, విదేశీయులు,  పర్యాటకులకు పెద్ద ఆకర్షణలలో ఒకటి, ఎందుకంటే దీని తయారీ,
చేతితో చేయబడిన చక్రం.



చేతి గాజుల తయారీ:

ఉత్తరప్రదేశ్‌, ఫిరోజాబాద్ లోని పురాతన కళ, గాజుల తయారీ. ఈ కళ తరతరాలుగా అందించబడుతున్న సాంప్రదాయ సాంకేతికతతో కూడిన ఒక చిన్న తయారీ సంస్థ. ఫిరోజాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద గాజుల తయారీదారుగా పేరు గాంచింది. ఇప్పటికి 200 సంవత్సరాలకు ముందు నుండీ చేతి గాజులను ఉత్పత్తి చేస్తోంది. మహిళల ఉపకరణాల పరిశ్రమలో ఆభరణాల విభాగంలో గాజులకు విపరీతమైన డిమాండ్.

వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల తయారీ:

 తోటల పెంపకం, వ్యవసాయం అనేవి పురాతన భారతీయ సంస్కృతులలో భాగం. సృజనాత్మకతను కలిగి ఉంటే, వ్యవసాయం అనేది నిత్య నూతనం. దానికి సేంద్రీయతను అద్దితే బంగారమే! 



డైరీ ఉత్పత్తులు. పాల సరఫరా:
పాలు, పాల ఉత్పత్తుల ఇండస్ట్రీ గత రెండు సంవత్సరాలుగా అత్యంత విప్లవాత్మకమైన మార్పులను
చూస్తోంది.


ఈ పరిశ్రమ భారతదేశంలో
 తమ మార్కెట్ వృద్ధి రేటును, రెట్టింపుగా నమోదు చేస్తోంది. పాలను అందించే కంపెనీ అమూల్ నిస్సందేహంగా మార్కెట్ లీడర్‌గా ఉంది. కానీ ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన వారు అమూల్ కు భారీ ఎత్తునే గండి కొడుతున్నారు.

 బట్టల వ్యాపారం:

వైవిధ్యభరితమైన భారతదేశంలోని, ప్రతి రాష్ట్రం కూడా, వస్త్ర పరిశ్రమలో తమదైన ముద్రను కలిగి ఉన్నాయి. తయారీ రంగంలోనూ, అమ్మకాలలోనూ మంచి అవకాశాలు, లాభాలు ఉన్నాయి. టెక్స్టైల్, విదేశీ డిమాండ్‌కు అనుగుణంగా వస్త్రాలను, డిజిటల్‌ పద్ధతిలో అందుబాటులో ఉంచితే లాభాల వర్షం ఖాయం. నానాటికీ పెరుగుతున్న వస్త్ర మార్కెట్ పురాతన వ్యాపారాలలో ఒకటి.
 
తాతల నుండి వస్తున్న వ్యాపారాలు:
1736లో లోవ్జీ నుస్సర్వాంజీ వాడియాచే స్థాపించబడిన వాడియా గ్రూప్ దేశంలో విజయవంతంగా పనిచేస్తున్న అతి పురాతన గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇది బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి, ముంబైలో ఓడలు, రేవులను నిర్మించడానికి ఒప్పందాలను పొంది వాటిని నిర్మించేది. చివరికి బొంబాయి లోని బ్రిటిష్ కలోనియల్ సంస్థలకు వ్యూహాత్మక ఓడరేవుగా మారింది. ఆసియాలో మొట్టమొదటి డ్రై డాక్‌ను 1750లో ముంబైలో లోవ్జీ అతని సోదరుడు సొరాబ్జీ నిర్మించారు. HMS మైండెన్, HMS కార్న్ వాలీస్, HMS ట్రింకోమలీ ది వాడియా గ్రూప్ నిర్మించిన కొన్ని చారిత్రక, అద్భుతమైన నౌకలు. కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ది వాడియా గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ అయిన బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 1863లో స్థాపించబడింది, ఇది బహిరంగంగా వర్తకం చేయబడిన పురాతన భారతీయ కంపెనీగా నిలిచింది.

సంవత్సరాలు గడిచేకొద్దీ, వాడియా గ్రూప్ సమయం మరియు సాంకేతికతకు అనుగుణంగా తనని తాను వృద్ధి పరచుకొంటూ, విస్తరణను కొనసాగించింది. బాంబే డైయింగ్ 1879లో స్థాపించబడింది, ఆ తర్వాత 1918లో స్థాపించబడిన బ్రిటానియా ఇండస్ట్రీస్ మరియు 1999లో స్థాపించబడిన నేషనల్ పెరాక్సైడ్ లిమిటెడ్. ఈ నాలుగు కంపెనీలు భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడ్డాయి. ప్రతి ఏడాది కొత్త పుంతలను తొక్కుతూ విజయాన్ని సాధిస్తూనే ఉన్నాయి.
 ఇదే సంస్థకు చెందిన ఇతర అనుబంధాలు.

గ్లాడ్రాగ్స్(ఫ్యాషన్ మ్యాగజైన్)

 వాడియా టెక్నో-ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్. (1960లో స్థాపించబడిన సివిల్ ఇంజనీరింగ్ సంస్థ)
 గో ఫస్ట్ (
2005లో గోఎయిర్‌గా స్థాపించబడింది)



పంజాబ్ కింగ్స్ (ఇండియా ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న పది ఫ్రాంఛైజీ జట్లలో ఈ క్రికెట్ జట్టు ఒకటి. ఇది 2008 సంవత్సరంలో స్థాపించబడింది.)
బాంబే రియాల్టీ (రియల్ ఎస్టేట్ సంస్థ.)
 RPG
గ్రూప్స్


వ్యవస్థాపకుడు రామ్‌దత్ గోయెంకా
1820లో స్థాపించబడింది.
రామ్ దత్ గోయెంక మేనల్లుడైన కేశవ్ ప్రసాద్ గోయెంకా నాయకత్వంలో డంకన్ బ్రదర్స్, ఆక్టేవియస్ స్టీల్, అనేక ఇతర వ్యాపారాలను కొనుగోలు చేయడం ద్వారా సమూహం విస్తరించి కంపెనీని ఒక సమ్మేళనంగా మార్చింది. సాధారణంగా తెలిసిన పేరు, RPG ఎంటర్‌ప్రైజెస్ 1979లో కేశవ్ ప్రసాద్ గోయెంకా కుమారుడు రామ్ ప్రసాద్ గోయెంకాచే స్థాపించబడింది. ఈ బృందంలో మొదట ఫిలిప్స్ కార్బన్ బ్లాక్, ఏషియన్ కేబుల్స్, అగర్పారా జ్యూట్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, మర్ఫీ ఇండియా ఉన్నాయి. ప్రధాన కార్యాలయం ముంబై నగరం లో ఉన్నది.

 ఆదిత్య బిర్లా గ్రూప్:

వ్యవస్థాపకుడు శివనారాయణ బిర్లా
1857లో స్థాపించబడింది

ఈ సంస్థకు అనేక వ్యాపారాలు ఉన్నాయి.

హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్
GD బిర్లాచే 1958లో స్థాపించబడింది.
ఇది అల్యూమినియం మరియు రాగి పరిశ్రమలో అగ్రగామి.
 
అల్ట్రాటెక్ సిమెంట్
1983లో కుమార్ మంగళం బిర్లాచే స్థాపించబడిన ఈ సంస్థ గ్రే సిమెంట్, రెడీ-మిక్స్ కాంక్రీట్ మరియు వైట్ సిమెంట్‌లలో అతిపెద్ద తయారీదారు.
 
నోవెలిస్ ఇంక్.
హిండాల్కో యొక్క స్వతంత్ర అనుబంధ సంస్థ. అమెరికాలో పనిచేస్తున్న నోవెలిస్ రోల్డ్ అల్యూమినియం, అల్యూమినియం రీసైక్లర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
 
గ్రాసిమ్ ఇండస్ట్రీస్
గ్రాసిమ్ ఒక వస్త్ర ఉత్పత్తిదారు. విస్కోస్ స్టేపుల్ ఫైబర్, విస్కోస్ ఫిలమెంట్ నూలు, రసాయనాలు, అవాహకాలు వంటి టెక్స్టైల్ ముడి పదార్థాలు తయారు చేస్తుంది.
 ఆదిత్య బిర్లా క్యాపిటల్
మాతృ సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కింద 2007లో స్థాపించబడినది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ రక్షణ, పెట్టుబడి, ఆర్థిక పరిష్కారాల వంటి సేవలను అందిస్తూ ఉంటుంది.
 ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్. భారతీయ ఫ్యాషన్ రిటైల్ కంపెనీ

ముగింపు:
ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది.
భారతీయ ప్రైవేట్ రంగం, దేశంలోని కొన్ని పురాతన వ్యాపారాలను కలిగి ఉంది. ఇవి కాలక్రమేణా అభివృద్ధి చెందాయి. నిరంతరం మారుతున్న మార్కెట్ అవసరాలకు సమాధానమివ్వడానికి తమను తాము పునర్నిర్మించుకుంటూనే ఉన్నాయి. అంతే కాదు. ఈ వ్యాపారాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ వంటి కొత్త మార్కెట్ అవకాశాలను తమ వ్యాపారంలో భాగం చేసుకుంటున్నాయి.