భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైన “సముద్రయాన్ ప్రాజెక్ట్” లోతైన మహాసముద్రాన్ని, అందులోని వనరులను అన్వేషించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ముగ్గురు శాస్త్రవేత్తలను 6000 మీటర్ల లోతుకు, సబ్‌మెర్సిబుల్ వాహనంలో పంపుతారు. కేంద్ర భూ శాస్త్రాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
సముద్రయాన్ ప్రాజెక్ట్, భారతదేశపు మొట్టమొదటి మానవసహిత సముద్ర మిషన్. లోతైన సముద్ర వనరులను అధ్యయనం చేయడానికి, జీవవైవిధ్య అంచనాలను సారి చూసుకోవటానికి రూపొందించబడింది. సబ్‌మెర్సిబుల్ అన్వేషణ ప్రయోజనాలను కాపాడుతుంది. మిషన్ పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగించదు. ఖనిజాల వంటి లోతైన సముద్ర వనరుల అన్వేషణ కోసం 'MATSYA 6000' అనే వాహనంలో ముగ్గురు సిబ్బందిని 6000 మీటర్ల లోతుకు పంపడం ఈ మిషన్ లక్ష్యం.
‘మత్స్య 6000’ వాహనాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) డిజైన్ చేసి అభివృద్ధి చేస్తోంది. ఇది సాధారణ ఆపరేషన్‌లో 12 గంటలు, అదే అత్యవసర అత్యవసర పరిస్థితుల్లో అయితే మానవ భద్రత కోసం 96 గంటల క్షమతను ప్రదర్శిస్తుంది.
ప్రాముఖ్యత:
మనుషులతో కూడిన సబ్‌మెర్సిబుల్ ప్రత్యక్ష జోక్యం ద్వారా అన్వేషించబడని లోతైన సముద్ర ప్రాంతాలను గమనించడానికి, అర్థం చేసుకోవడానికి శాస్త్రీయ సిబ్బందిని అనుమతిస్తుంది. నీలి ఆర్థిక వ్యవస్థను హైలైట్ చేసే 'న్యూ ఇండియా' మరింత చేయూతనిస్తుంది. భారతదేశం ఒక ప్రత్యేకమైన సముద్ర ప్రాంతాన్ని కలిగి ఉంది, దీని తీర ప్రాంతం 7517 కి.మీ పొడవు. తొమ్మిది తీరప్రాంత రాష్ట్రాలు, 1,382 ద్వీపాలకు నిలయం.
భారతదేశానికి మూడు వైపులా ఉన్న మహాసముద్రాలు అపార సంపదను తమలోపల కలిగి ఉన్నాయి. దేశ జనాభాలో దాదాపు 30% ప్రజలు తీర ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరికి తగిన సహాయ సహకారాలు అందిస్తే, ఫిషరీస్, ఆక్వాకల్చర్, టూరిజం, జీవనోపాధి, నీలి వాణిజ్యానికి మద్దతు ఎంతో మద్దతు లభిస్తుంది.
ఈ డీప్ ఓషన్ మిషన్ ఏమిటి?:
డీప్ ఓషన్ మిషన్ జూన్ 2021లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ద్వారా ఆమోదించబడింది. వనరుల కోసం లోతైన సముద్రాన్ని అన్వేషించడం, సముద్ర వనరుల స్థిరమైన వినియోగం కోసం లోతైన సముద్ర సాంకేతికతలను అభివృద్ధి చేయడం, భారత ప్రభుత్వం యొక్క బ్లూ ఎకానమీ ఇనిషియేటివ్‌కు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.
మిషన్ వ్యయం వచ్చేఐదు సంవత్సరాల కాలంలో 4,077 కోట్లు. మిషన్ దశలవారీగా అమలు చేయబడుతుంది.
సంబంధిత ఇతర కార్యక్రమాలు:
సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కోసం బ్లూ ఎకానమీపై భారతదేశం, నార్వేల టాస్క్ ఫోర్స్: ఇది రెండు దేశాల మధ్య ఉమ్మడి కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి, 2020లో రెండు దేశాలు సంయుక్తంగా ప్రారంభించాయి.
సాగరమాల ప్రాజెక్ట్: ఓడరేవుల ఆధునీకరణ కోసం ఐటీ ఎనేబుల్డ్ సేవలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా పోర్ట్ ఆధారిత అభివృద్ధికి “సాగరమాల ప్రాజెక్ట్” నిజంగా ఒక వ్యూహాత్మక చొరవ.
O-SMART: భారతదేశం O-SMART పేరుతో ఒక పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తోంది. స్థిరమైన అభివృద్ధి కోసం సముద్రాలు, సముద్ర వనరులను నియంత్రితతం గా వినియోగించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్:
ఈ కార్యక్రమం ద్వారా తీర, సముద్ర వనరుల పరిరక్షణపై దృష్టి పెట్టబడుతుంది. తీర ప్రాంత వాసుల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది.
జాతీయ మత్స్య విధానం:
భారతదేశం 'బ్లూ గ్రోత్ ఇనిషియేటివ్'ను ప్రోత్సహించడానికి జాతీయ మత్స్య విధానం ఒక కారణం. సముద్ర, ఇతర జల వనరుల నుండి ఉత్పన్నమయ్యే మత్స్య సంపద యొక్క స్థిరమైన వినియోగంపై దృష్టి పెడుతుంది.
ఈ మిషన్ నిర్వహణ వలన యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనాతో సహా సబ్‌సీ మిషన్‌లను నిర్వహించడానికి స్పెషలిస్ట్ టెక్నాలజీ, వాహనాలు సమకూర్చబడిన ఎలైట్ దేశాల సరసన భారతదేశం చేరవచ్చు.
సముద్రయాన్ మిషన్ 2026 నాటికి అమలు చేయబడుతుంది. సముద్రయాన్ ప్రాజెక్ట్ అనేది డీప్ సీ మిషన్ లో ఒక భాగం. డీప్ సీ మిషన్‌కు రాబోయే ఐదు సంవత్సరాల వ్యవధిలో కాబోయే వ్యయం రూ. 4,077 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది దశలవారీగా అమలు చేయబడుతుంది.
డీప్ సీ మిషన్ దేశానికి ముఖ్యమైనది. ప్రత్యక్షంగా లోతైన సముద్రంలో అన్వేషించబడని లేదా అన్వేషించలేని భాగాలను పరిశీలించడానికి, అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మిషన్ కొరకు భారత్, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా వంటి దేశాల సాంకేతిక సహాయం కోరవచ్చు.
ముగింపు:శరవేగంగా మార్పు చెందుతున్న భారత్ డీప్ సీ మిషన్ ను సునాయసం గా నిర్వహించగలదు. ఇప్పటికే అందుబాటులో ఉన్న టెక్నాలజీ, కొత్త విషయాల పై జిజ్ఞాస, స్థిరంగా కొత్త విషయాలను కనుక్కునేందుకు ప్రోత్సహించే ప్రభుత్వం వంటి వాటిని ఇందుకు ఉదాహరణలుగా తీసుకోవచ్చు. మిషన్ విజయవంతంగా నిర్వహింపబడటం వలన ప్రథమంగా తీర ప్రాంత వాసులకు లాభదాయకంగా ఉంటుంది. భారత్ లాభాలను పొందవచ్చు. ప్రపంచం దృష్టిలో మన శాస్త్రవేత్తలకు, పరిజ్ఞానానికి కొత్త భాష్యం లిఖింపబడుతుంది.
