మధ్యతరగతి కుటుంబ ప్రయాణ ప్రణాళికలు. (Madhyataragati kutumbam. Prayana pranalikalu)(Middle class family's Travel plans in Telugu):
ప్రారంభం:
భారతదేశం నలుచెరుగులా వింతలూ, విశేషాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు,విజ్ఞాన, విహార యాత్రలకు ఉత్తేజాన్నిచ్చే ప్రదేశాలు ఉన్నాయి. భారత్ ని మొత్తం శోధించు(Explore)కార్యక్రమం అన్నది కషమైన విషయమే. కానీ అసాధ్యం కాదు. భరతమాతకు కిరీటంగా కల హిమాలయాల నుంచి, పాదాలు కడుగుతూన్న సముద్రం వరకూ ఎంత చూసిన తక్కువే. ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇటువంటి యాత్రలు చేయటం కష్టమేనా? సాధ్యం కాదా? అంటే తప్పక సాధ్యమే అన్న సమాధానం వస్తుంది.
కొన్ని సూచనలు:
ఏ విధంగా సాధ్యం. దీనికి కావలసిందల్లా రకరకాలుగా తయారుచేసుకున్న ప్లానింగ్(Types of planning). దీని వలన ప్రయాణీకులకు చాలా క్లారిటీ ఇంటి వద్దనే వచ్చేస్తుంది. ముందుగానే కుటుంబం నుండి ఎంతమంది ‘యాత్ర’కు బయలుదేరుతున్నారనే దగ్గరి నుండి ఈ ప్లానింగ్ మొదలవుతుంది. ఏ ప్రయాణానికి వెళ్లినా రైలు నే ఆశ్రయించండి.
దీని వల్ల ప్రయాణం సౌకర్యవంతంగానూ, అనుకూలంగానూ జరుగుతుంది. యాత్రలలో సింహభాగం ఖర్చు అయ్యేది మన లాడ్జింగ్ కి(Lodging), భోజనానికి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కి. ఇదే కాక మనం దర్శించడానికి వెళ్ళిన ప్రదేశంలో టికెట్లు ఇతర ఖర్చులు. ముందుగానే అనుకున్నాం కదా. దూర ప్రయాణాలకు రైలు అంత సౌఖ్యం మరొకటి లేదు. లోకల్ గా మనం తిరగటానికి ప్రభుత్వ బస్సులు, లేదా షేరింగ్ ఆటోలు బాగా కలిసి వస్తాయి. వీటన్నింటికన్నా ముఖ్యం మనం వెళ్ళిన ప్రదేశంలో మన నివాసం. హోటల్స్ లో దిగితే చాలా ఖర్చు అవుతుంది. దీనికి తోడు రూమ్ సర్వీస్ అనీ, జీఎస్టీ అనీ రకరకాల పేర్లతో మరింత ఖర్చు అవుతుంది. దీనికి తరుణోపాయం. "హాస్టల్స్, అవర్లీ రూమ్స్(Hourly rooms)". ఇవి చాలా శుభ్రంగా నిర్వహిస్తారు.
ఈ అవర్లీ రూమ్స్ లేదా హాస్టల్స్ లలో స్థానికంగా ఉద్యాగాలు చేసే వారు, విద్యార్థులు నివసిస్తారు. ఇవి ఎంతో చవకగానూ, శుభ్రంగానూ ఉండటమే కాక తమ పని ప్రదేశానికి దగ్గరలోనే ఉండటం వల్ల బ్యాచిలర్స్ ఎక్కువగా వీటినే ఇష్టపడతారు. వీటినే మనం మన ప్రయాణంలో ఉపయోగించుకుంటాం. ఈ సర్వీస్ లు భారతదేశ వ్యాప్తంగా ప్రతిచోటా లభ్యం అవుతున్నాయి. ఉదాహరణకు బెంగుళూరులో ఒక జంటకు రూమ్ ప్రొవైడ్ చేసినందుకు కానూ ఒక రోజుకు గానూ ఎనిమిది వందలు ఛార్జ్ చేస్తున్నారు. మైసూర్ లోనూ అంతే. ఈ చార్జీలో పొద్దుటి బ్రేక్ఫాస్ట్ కూడా కలిసి ఉంటుంది. ఇదే ఒక జంటకు కాన్పూర్ (UP)లో వెయ్యి రూపాయలు చార్జీ చేస్తారు. ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్.
లోకల్ గా తిరగటానికి ప్రతి ఛోటా మనకు టూ వీలర్ లను అద్దెకిచ్చే వారు ఉంటారు. సాధారణంగా రోజుకు 500.00 రూపాయలు ఛార్జీ చేస్తారు. తిరుపతి, గోవా, కోల్కతా, కాశీ, చెన్నై, హైద్రాబాద్, బెంగుళూరు, కులు, .యానాం, ఢిల్లీ ఇలా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఈ సౌకర్యం ఉన్నది.
ప్రయాణంలో ఎక్కువ బరువుని తీసుకుని వెళ్ళవద్దు. ఇది ట్రావెలింగ్ లో చాలా ఇబ్బందిగా మారుతుంది.. ఒకవేళ ఒక జంట ప్రయాణం చేయాలనుకుంటే రెండు బ్యాక్ ప్యాక్స్ తీసుకుని వాటిలో సరిపడినంత మాత్రమే బట్టలు, ఇతర సరుకులు తీసుకెళ్లాలి.
మంచి టూరిస్ట్ సీజన్ లో ప్రయాణాలు పెట్టుకోవద్దు. వసతికి గానీ, రైల్వే టికెట్లకు గానీ, ఏకాంతాన్ని ఎంజాయ్ చేయటానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ సీజన్ ఐతే బెస్ట్.
భోజనాలు కానీ, బ్రేక్ఫాస్ట్ లేదా ఏవైనా స్నాక్స్ తీసుకోవటం కానీ బడ్జెట్ హోటల్స్ ని ఎన్నుకోవటం ఉత్తమం. దీని వల్ల ఖర్చు సగానికి సగం ఆదా అవుతుంది. లోకల్ ఫుడ్ ఆస్వాదిస్తున్నప్పుడు జాగ్రత్త. ఆ తిండి పడక, కడుపు పాడైతే ప్లాన్ మొత్తం పాడవుతుంది. ఢోక్లా, ఇడ్లీ, పెరుగన్నం వంటివి అనుకూలం.
బడ్జెట్ ప్లానింగ్:
ఒక కుటుంబం(One family) భారతదేశం లోని ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు 2.500/- నుండి 3000/- వరకూ ఖర్చు అవుతుందని వివిధ ట్రావెల్ ఏజెన్సీ వారు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ప్రిపేర్ ఐతే మంచిది. ఏ ప్రాంతానికైనా సరే సందర్శించడానికి వెళ్ళినప్పుడు సగటున ఇది ఒక రోజుకి అయ్యే ఖర్చు. ఇంతే అవ్వాలని లేదు. తక్కువా అవవచ్చు, ఎక్కువా అవవచ్చు. ట్రావెల్ ఏజెన్సీలు వారి వారి అనుభవాలను తెలియజేసినప్పుడు, ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తెలిపారు. ఐతే వారు పేర్కొన్న సంఖ్య ఇదమిద్ధంగా పైన పేర్కొన్న రెంటి మధ్య ఉన్నది. అందువల్ల ఈ రెండు సంఖ్యలను పరిగణనలోకి తీసుకోవటం జరిగింది.
గూగుల్ సహాయం అవసరం:
రైల్వే టికెట్ల గురించి, లోకల్ ట్రాన్స్పోర్ట్ ల(Local transport) గురించి, వసతులు, హాస్టళ్ల గురించి భోజన వసతుల గురించి మొత్తం సమాచారం మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది. వెళ్ళాలి అనుకున్న ప్రదేశం గురించి మరింత సమాచారం తెలుసుకొని బయలుదేరాలి. ఆల్రెడీ వెళ్లి వచ్చిన వారి రివ్యూలు చదవాలి. సమాచార సేకరణ ఎంత నిశితంగా ఉంటె, ప్రయాణంలో ఉన్న సమయంలో మనకి అంత మేలు. ఎంతగానో ఉపయోగ పడుతుంది.:
ముగింపు:
ఉత్తర దేశం సందర్శనకు చలికాలంలో వెళితే స్వెటర్లు, మఫ్లర్లు, గ్లౌజ్, బూట్లు వంటివి తప్పక తీసుకుని వెళ్ళాలి. హోటల్స్ లేదా హాస్టల్స్ వారు ఎట్లాగూ దుప్పట్లు, రగ్గులు మనకు సమకూరుస్తారు. కొన్ని చోట్ల 0 డిగ్రీలకు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాస రచయిత జనవరీ ప్రాంతంలో, ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్(Kanpur) లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతను చూడటం జరిగింది.
కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మరికొన్ని మెళకువలు పాటించడం వల్ల ప్రయాణం సుఖవంతంగానూ, సౌకర్యవంతంగానూ సాగించవచ్చు. ముఖ్యంగా ఖర్చు అదుపులో ఉంటుంది.
