భారతదేశం తక్కువ ధరకు జనరిక్ ఔషధాలను అందించడంలో ప్రసిద్ధి చెందింది. ప్రపంచానికి ఆరోగ్య ప్రదాత అన్నా అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు వారు భరిచగలిగే ధరలలో, నాణ్యమైన మందులను అందించి ఆరోగ్య సంరక్షణను పొందేలా చేస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో జెనరిక్ ఔషధాల భద్రత, సమర్థతలకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనరిక్ మందులు ఎందుకు సురక్షితమైనవి?, ఎంత సురక్షితమైనవి?
అవి ఆరోగ్య సంరక్షణకు ఎంతవరకూ దోహదపడతాయి? వంటి ప్రశ్నలు పుంఖానుపుంఖాలు.తేడా ఏమిటి?
జనరిక్, నాన్-జెనరిక్ ఔషధాలు ఒకే మోతాదు, రూపం, భద్రత, నాణ్యత ఒకటే. అలాగే పనితీరు కూడా సమానంగానే ఉంటుంది. రెండూ కూడా క్రియాశీల పదార్థాలతోనే తయారు చేయబడతాయి. జనరిక్ ఔషధం, నాన్-జెనరిక్ ఔషధాల మాదిరిగానే పనిచేస్తుంది.
సురక్షితమైనవి:
జనరిక్ మందులు, బ్రాండ్ నేమ్ మందుల వలె
అదే నియమాలు,
తయారీ ప్రమాణాలకు లోబడి తయారఔతాయి. జెనరిక్స్
తో సహా
అన్ని ఫార్మాస్యూటికల్స్ అంతర్జాతీయ
నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా భారత ప్రభుత్వం కఠినమైన చట్టాలను
రూపొందించింది. అంటే జెనరిక్ ఔషధాలు బ్రాండ్ నేమ్ ఔషధాల వలె సురక్షితమైనవి మాత్రమే
కాక
ప్రభావవంతమైనవి కూడా.
జెనరిక్ ఫార్మాస్యూటికల్స్, బ్రాండ్-నేమ్
మందుల కంటే భారతదేశంలో చాలా తక్కువ ఖరీదు. జెనరిక్ ఔషధాలకు బ్రాండ్-నేమ్ మందుల వలె
అదే స్థాయిలో పరిశోధన, అభివృద్ధి(R&D), పరీక్షలు అవసరం
లేకపోవడమే దీనికి కారణం.
జెనరిక్ మెడిసిన్., నాన్-జెనరిక్ మెడిసిన్ మధ్య ప్రధాన వ్యత్యాసం తయారీదారులకు అయ్యే ఖర్చు. జెనరిక్ మెడిసిన్ తయారీకి, పేటెంట్‌కు సంబంధించిన ఖర్చులు ప్రధానంగా భారీ వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. జనరక్ కి బ్రాండ్-నేమ్ అవసరం లేదు. నాన్-జెనరిక్ మెడిసిన్ కి ఉండే విధి విధానాలు, ఆర్&డీ, ప్రత్యేక హక్కులు అవసరం లేదు. అందువల్ల జనరిక్ ఔషధాల ధర తక్కువ మొత్తంలో ఉంటుంది.
ఎందుకు ప్రాచుర్యం పొందలేదు?
భారతదేశంలో జనరిక్ ఔషధాలు ప్రసిద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం బ్రాండింగ్ లేకపోవడం. భారత్ వంటి దేశాలలో బ్రాండింగ్ అన్నది చాలా ముఖ్యం. రిటైల్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, కిరాణా సామాగ్రి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వంటి రంగాల్లోనే కాక, జనరిక్ ఔషధ వ్యాపారంలో కూడా బ్రాండింగ్ అన్నది విక్రయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
భద్రత:
జనరిక్ ఔషధాల ధర తక్కువే మాత్రమే కాక రెగ్యులర్ మందుల లాగే ప్రభావవంతంగా పని చేస్తాయి. ఈ ఔషధాల తయారీదారులు అభివృద్ధి, పరిశోధన,
జంతువులు, మానవుల పైన చేసే క్లినికల్ ట్రయల్స్, మార్కెటింగ్, ప్రకటనలు వంటి వాటి కోసం డబ్బు ఖర్చు చేయరు. పేటెంట్ హక్కు గడువు ముగిసిన నాన్-జెనరిక్ ఔషధాన్ని, జెనరిక్ ఔషధంగా విక్రయించడానికి అనుమతి పొందటానికి సంబంధిత అధికారులకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది భద్రత, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చేత మూల్యాంకనం చేయబడి ఆమోదించబడుతుంది.
ఒక నాన్ జనరిక్ ఔషధం తన పేటెంట్ సమయంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకుని మందులను తయారుచేస్తుందో, ఎన్నైతే ప్రమాణాలను పాటిస్తుందో అన్నిటినీ జనరిక్ ఔషధ తయారీ సమయంలోనూ పాటించి తీరాలి. 'ఫార్మకోవిజిలెన్స్' కేంద్రాలు మందుల భద్రత, దుష్ప్రభావాలను పర్యవేక్షిస్తాయి. అధికారులు, వినియోగదారులకు సమర్థవంతమైన, సురక్షితమైన, నాణ్యమైన మందులు పొందుతున్నారని నిర్ధారించుకున్నాకే ఆమోదం తెలుపుతారు. సమస్య నివేదికలను పరిశోధిస్తారు. తయారీదారులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు కలిసి ప్రజలకు ఈ ఔషధాలను సిఫార్సు చేస్తారు.
PMBJP (ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన) యొక్క ప్రయత్నం ప్రజలకు చికిత్సా ఔషధాలను అందుబాటు ధరలలో ఉంచడం, ప్రధానమంత్రి జన్ ఔషధి నుండి కూడా జెనరిక్ మందులను కొనుగోలు చేయవచ్చు.
ఎందరికి తెలుసు:
వైద్యులు సాధారణంగా కొన్ని
ఫార్మసీ కంపెనీలతో టై-అప్‌లను కలిగి ఉంటారు. కొన్నిసార్లు
వారి బంధువులు ఫార్మసీని నడుపుతుంటారు. మరికొందరు
డాక్టర్లు నాన్ జనరిక్ మందులు పని చేసినంతగా జనరిక్ మందులు పని చేయవని నమ్ముతారు.
అందువలన జనరికి మందులను ప్రిస్క్రైబ్ చేయరు. కొందరు
రోగులు కూడా తమకు బ్రాండెడ్ మందులు మాత్రమే కావాలని డిమాండ్ చేయటం మరో కారణం.
ఫలానా పేరు గల ఔషధం తీసుకోక పోవటం వలన తమకు రోగం తగ్గలేదని లేదా దుష్ప్రభావం
కలిగించిందని నమ్ముతారు.
ముగింపు:
జనరిక్ ఔషధం వైద్య పరిశోధన, ఆవిష్కరణలకు
ఆటంకం కలిగించదు. నిరుత్సాహపరచదు. నిజానికి రీయింబర్స్‌మెంట్
సిస్టమ్‌ను సద్వినియోగం చేసుకునే అనేక ఆసుపత్రులు ఫార్మసీలలో పెద్ద సంఖ్యలో జనరిక్
మందులను ఉపయోగించుకుంటున్నాయి. ప్రజలకు మంచి నాణ్యత కలిగిన ఆరోగ్య
సంరక్షణను అందుబాటులో ఉంచడమే ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యం. జనరిక్ మందుల విక్రయం మరింత
దూకుడుగా మారాలి. కోవిడ్-19
యొక్క సామాజిక ఆర్థిక ప్రభావం వల్ల సామాన్యుడి ఖర్చు చేసే సామర్థ్యం చాలా తగ్గింది.
అలాగే, ప్రాణాంతక
వ్యాధులు పెరిగాయి. ఇదే సమయంలో సరసమైన ధరలు
కలిగిన మందులకు
అధిక డిమాండ్ ఉంది. హక్కులను అర్థం చేసుకోవడం, జెనరిక్
ఔషధాల కోసం వైద్యులను అభ్యర్థించడం చాలా అవసరం.
ప్రత్యామ్నాయాల కోసం, వైద్యునితో
చర్చలు అవసరం. ఆర్థిక పరిస్థితులు
సరిగా లేవని చికిత్సను ఆపివేయలేం కదా!!
