మధ్యతరగతి నివాసానికి అనువైన పట్టణం. (madhyataragati nivasaniki anuvaina pattanam) (Which City is appropriate for Middle class):
భారతదేశంలో ఎనభై శాతం ప్రజలు మధ్యతరగతికి చెందిన వారే. ఇది ప్రభుత్వమూ, వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలు వివిధ రకాలుగా సర్వే లను నిర్వహించి స్పష్టీకరించిన విషయం. పరిస్థితులు ఎలా ఉన్నా తమను తాము సద్దుకొని పోగలరు. తాము పుట్టి పెరిగిన ఊరిలో, ఊహించని రీతిలో అభివృద్ధి జరిగి తమ రోజువారీ జీవనానికే ఇబ్బందిగా ఉన్నా సరే. ఇలా అనడానికి కారణం ఏమిటంటే, ఆయా పట్టణాలలో జీవనవ్యయం(Cost of living) విపరీతంగా పెరిగిపోవటమే. అయినా ఆ ప్రదేశం తమకు ముందు నుండీ అలవాటు పడిన ప్రదేశం అవటం వలనో, పరిచయాలు ఉండటం వలనో విడిచి వెళ్ళటానికి ఉత్సుకత చూపరు.
ఐతే పరిస్థితులు ఇటీవలి కాలంలో కొంత మారాయి. తమ పిల్లలు ఉద్యోగ రీత్యా, ఇతర కారణాల వలన వేరే వద్ద స్థిర పడి ఉండటం వల్ల, వారికి ఇబ్బంది కలిగించకుండా తామూ ఆ ప్రదేశానికి షిఫ్ట్ అవుతున్నారు.
సర్వే సంస్థలు:
ఈ విషయం ఇలా ఉంచితే, భారతదేశంలో మధ్యతరగతి వారు నివసించడానికి అనువైన పట్టణాలు ఏవి? ప్రశ్న చిన్నదే కానీ దీనిపై చాలా పరిశోధనే జరిగింది. భారత దేశంలోని స్థితిగతులను గురించి, నివాస యోగ్యమైన పట్టణాల గురించి, జనాభా గురించి, ప్రజల ఆదాయ వ్యయాల గురించి, విద్య మరియు వైద్య అవసరాల గురించి ఎప్పటికప్పుడు సర్వేలు జరుగుతూ ఉంటాయి. వీటిని ముందు అనుకున్నట్లుగా వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయి. ICE , 360 డిగ్రీస్, లోక్ ఫౌండేషన్, Center for the Advanced Study of India (CASI), యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వంటివి ఉన్నాయి.
మధ్యతరగతికి అనువైన పట్టణాలు:
వీరి ప్రకారం భారత దేశంలో మధ్యతరగతికి అత్యంత అనువైన పట్టణాలు మొదటగా బెంగుళూరును పేర్కొన్నారు. తరువాత స్థానాలలో వరుసగా చెన్నై, పూణే, హైదరాబాదు, చండీగర్, ముంబై, ఇండోర్, కోయంబత్తూర్ ఉన్నాయి. ప్రామాణికంగా తీసుకున్న అంశాలు పాఠశాలలు, ఉద్యానవనాలు, ట్రాన్స్పోర్ట్, అద్దెలు, పరిశుభ్రత, రక్షణ వ్యవస్థలు ఇత్యాదివి. పైన పేర్కొన్నవి సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉన్నవిధానాన్ని బట్టి ప్రజలు ఆయా పట్టణాలను ఎన్నుకున్నారు. ఐతే ఇది ఒక సంస్థ సర్వే మాత్రమే. ఇటువంటి సర్వేలు మరికొన్ని జరిగినై. ప్రతి దానిలోనూ పాల్గొన్న ప్రజలు తమకు అందుబాటులో ఉన్న పట్టణాలను పేర్కొన్నారు. ఐతే అందరూ దాదాపుగా పేర్కొన్నవి పైన ఉదహరించిన పట్టణాలనే. వాటి స్థానాల్లో మార్పు మాత్రమే జరిగింది. ఒకటి రెండు కొత్త పట్టణాలు కూడా తోడవటం జరిగింది కొండొకచో. భారతదేశంలో మీకు నివాసానికి ఎక్కడ అనువుగా ఉంటుంది అన్న ప్రశ్నకు మరొక సర్వేలో:..
గుజరాత్ లోని సూరత్, మహారాష్ట్రలోని ముంబై, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని నవీ ముంబై, వెస్ట్ బెంగాల్ లోని కోల్కతా, తెలంగాణలోని హైద్రాబాద్, తమిళనాడులో చెన్నై తరువాత కోయంబతూర్ ఇలా తమ వరుస క్రమాన్ని ఇచ్చారు.
భారత్ లో అత్యంత సంతోషకరమైన పట్టణంగా దాదాపు అందరూ కాన్పూర్(Kanpur) ని పేర్కొన్నారు.
అతి తక్కువ కాస్ట్ అఫ్ లివింగ్ ఉండే పట్టణాలు తిరువనంతపురం, నాగపూర్, బెంగళూర్, హైద్రాబాద్, ఇండోర్, కోల్కతా, వడోదర, చంఢీగర్.
ఇబ్బంది కలిగించే పట్టణాలు:
ఇందులో కొంతమందివి వ్యక్తిగత అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. వీరి ప్రకారం సెవెన్ సిస్టర్స్(Seven sisters) గ పిలవబడే నార్త్ ఈస్ట్ స్టేట్స్ లోని ..మిజోరం లో జీవనం అత్యంత దుర్భరంగా ఉంటుంది. అక్కడి ప్రాంతీయ భాష ఐన 'మిజో' రాకపోతే చాలా కష్టం. ప్రజలకు ఎవరికీ కూడా ఇంగ్లిష్, హిందీ రావు. సాయంత్రం 5 కాగానే పట్టణమంతా ఖాళీ అయిపోతుంది. సినిమాలు కానీ, మాల్స్ కానీ, ఉద్యానవనాలు కానీ మచ్చుకు కూడా అగుపడవు. అక్కడక్కడా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అవే కాలక్షేప కేంద్రాలు. ఆదివారం అన్ని దారులు చర్చీలకే. దక్షిణ భారత దేశంలో తమిళ నాడుకు అటువంటి మార్కులు వచ్చాయి. ఎంటర్టైన్ మెంట్ కు కొదవ లేదు. అన్నీ అందుబాటులో ఉంటాయి. అయితే అక్కడమేలు మిళితం:
తమిళనాడులోని తిరుచ్చి కి మంచి మార్కులే పడ్డాయి. అక్కడి ప్రజలు చాలా స్నేహంగా ఉంటారు. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. బడులు, పార్కులు, సినిమాలు, ఆసుపత్రులు, రవాణా సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. దీని వలన మధ్యతరగతి కుటుంబం తిరుచ్చిలో మంచి సమయాన్ని గడపవచ్చు.
ఉపసంహారం:
ఉద్యోగార్థులై దక్షిణ భారతదేశం వారు, ఉత్తరానికి , అక్కడి వారు ఇక్కడికి రాకపోకలు జరపడం వల్ల ఒకరి సంస్కృతులు మరొకరికి అర్థమౌతున్నాయి. ఏ విధంగా తమ తమ జీవనాలను సంక్షిప్తం చేసుకుంటారని పరిశోధనలు జరుగుతున్నాయి. జీవన వ్యవహారాలను, ఆహారపు అలవాట్లను ఇచ్చి పుచ్చుకోవటం జరుగుతోంది.
ఇంతే కాక పెళ్లిళ్ల ద్వారా కుటుంబాలు కలవటం కూడా ఒక ప్రత్యేకం. మీరు గమనించి ఉంటారు. బెంగుళూరులోనూ, హైద్రాబాదులోనూ ఉత్తర భారతదేశానికి చెందిన వారు స్థిరపడుతున్నారు. పుట్టి, పెరిగి, రిటైరైన తమ స్వంత ఊర్లను వదిలి మరీ వచ్చి ఇక్కడ స్థిర పడుతున్నారు. అంతేకాక ఇక్కడి సంస్కృతిని, ఆహారపు అలవాట్లను కూడా స్వంతం చేసుకుంటున్నారు.
కొత్తగా ఉద్యోగాలను సృష్టిస్తున్న నగరాలను గురించి కూడా సర్వే జరిగింది. మొదటి స్థానంలో బెంగళూరు నిలిచింది.తరువాతి స్థానాలలో హైద్రాబాదు, చెన్నై, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా నిలిచాయి.
