భారతీయత పై విదేశీయుల అభిప్రాయం.(Bharateeyata/bharatadesham pai videseeyula abhiprayam)(Foreigners opinion on India):

 పరిచయం:

అన్ని మతాలు సమానంగా చూడబడేది భారతదేశంలోనే. ఇది వినటానికి లేదా విజ్ఞులు పాల్గొనే  ఏ మీటింగులోనో చెప్పేందుకు అనే మాట కాదు. యదార్ధంగా భారత్ లో మతాలు అన్నీ ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే భావన లేకుండా గౌరవింపబడతాయి. పురుషులకు, మహిళలతో సమానంగా గౌరవం ఇవ్వబడుతుంది. ఇక్కడ ఉంటూ పుట్టి పెరిగిన ఎవరైనా ఇదే మాట అనొచ్చు. ఇవే మాటలను దేశాన్ని సందర్శించిన విదేశీయులు అంటే!!

ప్రాచీన గ్రీకులు మరియు రోమన్లు ​​భారతదేశాన్ని సంపదకి, శ్రేయస్సుకి మారుపేరుగా ఈ భూమిని  భావించారు. మెగస్తనీస్(megasthenes) అనే గ్రీకు చరిత్రకారుడు భారత సైన్యం యొక్క విస్తారత, భారతీయ వనరుల సమృద్ధతను విపులంగా వివరించాడు. భారతీయ ఋషుల అధునాతన తత్వశాస్త్రం గురించి రాశాడు. అరబ్ వ్యాపారులు మరియు ప్రయాణికులు భారతదేశాన్ని సుగంధ ద్రవ్యాలు మరియు వస్త్రాల భూమిగా అభివర్ణించారు. లక్షద్వీపాలలో అడవులు తగలబెడితే చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకూ కొన్ని నెలల పాటూ సుగంధాలు నిండిన పొగ వచ్చిందని చెపుతారు.

ఇక్కడి వారి అప్యాయతే వారికి ఆకర్షణ:

ఇక్కడి ఔత్సాహికమైన వాతావరణం, రంగురంగుల సాంప్రదాయ దుస్తులు, స్నేహపూర్వక వాతావరణం ప్రత్రి ఒక్కరికీ  ఎంతగానో నచ్చుతాయి. పూర్వీకులు చెప్పిన "అతిథి దేవో భవ"(Atithi devo bhava) అన్న మాటను ఇప్పటికీ పాటిస్తారు. రంగురంగుల దీపాలు, రంగుల పండుగ ఐన హొలీ(Holi), పూల పండుగ ఐన బతుకమ్మ(Bathukamma) వంటివి ఎంతగానో ఆకర్షణ కలిగి ఉంటాయి. ఒక చిన్న పరిచయపు నవ్వు లేదా పలకరింపు కూడా మిమ్మల్ని వారింటికి ఆహ్వానం పలికేటట్లు చేస్తుంది.

భాష అన్నది సమస్యే కాదు. ఇంగ్లిష్ రాకపోయినా ఒకరికొకరు వారిలో వారే మాట్లాడుకుని మరీ సహాయం చేస్తారు. అది ఎంత చిన్నదైనా సరే. చివరికి దారి చెప్పేందుకు కూడా. చాలా మంది ఇంగ్ల్లీస్ మాట్లాడగలుగుతారు. కనీసం అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల పని చాలా జరగటం చాలా సులభం. ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు వారి బాడీ లాంగ్వేజ్ కానీ, మొహంలో చిన్న నవ్వుతో కూడిన మర్యాద కానీ కట్టి పడేస్తుంది.

భోజనం:

దోశ(Dosa) అందరికీ ఇష్టం. దేశం నలుమూలలా లభించే వంటకం దోశ. అందరికీ ప్రియమైన బ్రేక్ఫాస్ట్. గుజరాతీ భోజనంలోని సమోసాలు కట్టిపడేస్తాయి. హైదరాబాదీ బిర్యానీ(Hyderabadi biryani)లోని సుగంధ ద్రవ్యాలు తిన్న చాలా సేపటి వరకూ నోటిలోనే సువాసనలు వెదజల్లుతాయి. కేరళ వారి ఆతిథ్యం మరువలేనిది. వారి కుటుంబంతో కలిసి భోజనం చేసేటప్పుడు చూపే ఆప్యాయత అంతే రుచిగా ఉంటుంది. ప్రేమగా వడ్డించే తీరు వలన పొట్ట వద్దంటున్నా మరికొంత తినేటందుకు ఉసిగొల్పుతుంది.


భారతదేశాన్ని మొత్తంగా ఆస్వాదించవచ్చు. మొదటిసారి సందర్శనకు వెళ్ళినప్పుడు భారతీయుల ఆహ్వానం మరువలేనిదిగా అనిపిస్తుంది. సంప్రదాయ పద్ధతిలో వారు స్వాగతించడమే అద్భుతమైన విషయం. బిజీగా. కిక్కిరిసి ఉండే రహదారులు, సాంప్రదాయ పద్ధతిలోని వేషధారణ, పురాతనమైన గుడులు గోపురాలు ఒకటేమిటి? దేశం మొత్తం ఒకేలాగా ఆనందాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ కొత్తగా, ఉత్తేజకరంగా మొదలవుతుంది.

స్వంతం చేసుకుంటారు:

సహాయపడటం వారికెంతో ఇష్టం. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఒక వ్యక్తి తన పనిని కొంత సేపటి కోసం వాయిదా వేసుఒంటరిగా ఉండనివ్వరు:కుని మరీ సహాయం అందించాడు(Helping nature). దాదాపుగా అతని రెండు గంటల విలువైన సమయం ఆనందంగా సహాయమందించడానికి వెచ్చించాడు. కేరళలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళటానికి ఎంతవుతుంది? ఎట్లా వెళ్ళాలి వివరించి చెప్పారు. అంతే కాకుండా టాక్సీని ఆపి సరియైన ధరకు బేరమాడి జాగ్రత్తగా పంపించారు. ఎందుకో వారినుండి మనం వేరుగా అనిపించం.

భారతీయులు సహజ దాతృత్వ వాదులు. ఒకానొక అమెరికన్ తన భారత పర్యటనలో భాగంగా ఒక పల్లెటూరిలో అనుకోకుండా రెండు రోజులు ఉండవలసి వచ్చింది. పల్లెటూరిలో ఒక్క వ్యక్తికీ కూడా తన భాష రాదు, కనీసం అర్థంకాదు. అయినా ఆ రెండు రోజులూ అవేమీ అడ్డు కాలేదు. తమ నివాసానికి అతనిని ఆహ్వానించి మనసైన ఆతిథ్యాన్ని అందించారు. ఆ రెండు రోజులూ అతగాడికి ఎట్లా గడిచాయో అర్థమే కాలేదు. తాను రాసిన వ్యాసంలో ఒకవేళ ఇదే పరిస్థితి అమెరికాలో జరిగితే ఏ విధంగా ఉండేది అన్న సందేహం వెలిబుచ్చాడు. ఖచ్చితంగా గుమ్మం వద్దే నిలబెట్టి మాట్లాడి పంపేసే వారు.

ఒంటరిగా ఉండనివ్వరు:

 ఒక విదేశీ మహిళ అనుకోకుండా ఒంటరిగా వెళ్లి మధ్యాహ్న భోజనం చేయవలసి వచ్చింది. తనకు కావలసిన ఆహారాన్ని ఆర్డర్ చేసి కూచుని ఉన్నది, పక్కన టేబుల్ వద్ద ఉన్న కుటుంబం వెంటనే మాటలు  కలిపి ఆమెలోని మొహమాటాన్ని పోగట్టి, అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తరువాత ఇంటికి ఆహ్వానించారు. ఈ విధమైన పధ్ధతి తెలియకుండానే మనసును ఆనందంతో నింపేస్తుంది కదా!!

భారత దేశాన్ని ఒకసారి సందర్శిస్తే సరిపోదు:

 అవును. జీవించడం ఎట్లాగో ఇక్కడ చూడవచ్చు. నడుస్తూ వెళుతుంటే, ఎన్నో అనుభవాలు. రోడ్ సైడ్ ఫుడ్ నుండి వస్తున్న కమ్మనైన వాసనలు, అడుగడుగునా కనపడే చాయ్ బండ్లు, నవ్వుతూ పలుకరించే ముఖాలు, బిజీగా ఉండే రహదారులు ఎంతగా చూసినా తక్కువగానే అనిపిస్తుంది. కొన్ని నగరాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అక్కడి స్మారకాలు(Monuments) ఒకసారి చుస్తే ఎంతమాత్రం అర్థం కావు. కనీసం రెండవసారి సందర్శించవలసిందే!!

భారతీయులు స్వంతం చేసుకుంటారు:

 ఉత్తర భారతంలో కానీ, దక్షిణ భారతంలో కానీ దొరికే ఆహారం అద్భుతంగ ఉంటుంది. మసాలాలు, కూరలు(Curries) నోట నీరు ఊరిస్తూ ఉంటాయి. మంచి చెడు అన్నది ఎక్కడికి వెళ్లినా ఉంటుంది. కానీ ఇక్కడ మనుషుల మనస్తత్వం మాత్రం మరువలేనిది. ఒకసారి తాము స్నేహితులుగా భావిస్తే సహాయం చేయటానికి ఎంతమాత్రం వెనుకాడరు. షరతు ఏమిటంటే వారు మిమ్మల్ని స్నేహితులుగా అంగీకరించాలి. ఒకవేళ మన స్నేహితుడు అందుబాటులో లేకపోతే ఇంకెవరినైనా అప్పగించి మరీ వెళ్తాడు. కానీ వదిలేసి మాత్రం వెళ్ళడు. ఇంకొక మాట. భారతీయ సినిమాను ఆస్వాదించిన వారు కూడా ఎంతో మంది.

భారతీయత అలవాటు పడితే వదలలేము. ఢిల్లీ, ముంబైలలో జరిగే ఫుడ్ ఫెస్టివల్స్ మరువలేనివి. శాకాహారం, మాంసాహారం వంటకాలు నోరూరిసిస్తూ ఉంటాయి. ఏది తిన్నా దానికి వ్యసనపరులమై పోయేంత రుచికరంగా ఉంటాయి. దానికి తోడు రంగురంగుల బట్టలలతో డాన్స్ చేసే యువత. లైవ్ మ్యూజిక్(Live music)  ఓహ్!! ఇది చెప్పడం చాలా తేలిక. అయితే అంతే సమర్థతతో అర్థం చేసుకోవటం కష్టం. ఎందువల్లనంటే ప్రత్యక్షంగా అనుభవించవలసినదే.:

ముగింపు:

ఇష్టాన్నే కాదు భారత దేశాన్ని అయిష్ట పడిన వారూ ఉన్నారు. మొదటి కారణం వారి ప్రకారం. కాలుష్యం(Pollution). గంగలో స్నానం  చేసిన ఒక విదేశీయుడికి మరునాటికి వళ్లంతా దద్దుర్లు వచ్చినాయి. వైద్యుడు ఇచ్చిన సలహా నీవు ఈ కాలుష్యాన్ని తట్టుకోలేవు. ఇంకోసారి ఇటువంటి పని చేయకు అని. ఇక్కడి రవాణా సౌకర్యం కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అడిగిన చోటికి రారు. వచ్చినా చాలా ఎక్కువ ధర అడుగుతారు. ప్రతి సారీ బేరమాడవలసిందే. కొన్ని ప్రాంతాలకు వెళితే భద్రతా ప్రమాణాలు అతి తక్కువగా ఉంటాయి. దాని కారణం గా స్వేచ్ఛగా అనుభూతి చెందటం, అనుభవాలను పొందటం వీలుకాదు. ఈ కారణం గానే చాలామంది భారదేశానికి రావటం మానుకున్నారు. అయితే మనం ముందే అనుకున్నాంగా మంచి చెడు అన్నవి ఎక్కడైనా ఉంటాయి అని.