భవిష్యత్తు సౌత్ ఇండియన్ సినిమాదేనా!(Bhavishyathu South Cinemadena!!)

 ప్రారంభం:

హిందీ చలన చిత్ర పరిశ్రమ, దక్షిణ భారత దేశపు సినిమాల ముందు నిలబడలేకపోతోంది. బాలీవుడ్ తమ బలంగా నమ్మే సూపర్ స్టార్ లు, వారి మార్కెటింగ్ నైపుణ్యం, విరివిగా వెదజల్లబడుతున్న డబ్బు ఇవి ఏవీ కూడా చిత్రసీమను బలపరచడం లేదు. తెలుగు చలన చిత్రాల డబ్బింగ్ పరంపర కొనసాగింది దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం. ముంబైలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో, సినిమా క్లైమాక్స్ కి ప్రేక్షకులు అందరూ లేచి ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతున్నప్పుడే ప్రజలు మార్పు కోరుతున్నట్లు అర్థమౌతుంది. 7  ఏళ్ల క్రితం విడుదలైన బాహుబలి మాత్రం లెక్కలను, అనుమానాలను పటాపంచలు చేసెసింది. ఒంటిచేత్తో విజయాన్ని ఆకాశపుటంచు దాకా వెళ్ళి తాకి మరీ వచ్చింది. భారతీయ చలనచిత్ర నిర్మాణంలో విజయానికి సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతాలను మార్చివేసి, బాక్సాఫీస్‌ను చుట్టివేసిన చిత్రాలలో మొదటిది. CII సౌత్ మీడియా&ఎంటర్‌టైన్‌మెంట్ నివేదిక ప్రకారం 2021లో,  ఆల్-ఇండియా సినిమా కలెక్షన్లలో 62 శాతం దక్షిణ భారత చిత్రాల నుండి వచ్చాయి. అంతే ఈ ధోరణి మరింత బలపడుతోంది. 

కరోనా కారణమా?