2023 రెండవ త్రైమాసికం ప్రారంభంలో, భారతీయ రైల్వే తన 160వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. మొట్టమొదటి ప్యాసింజర్ రైలు 1853 ఏప్రిల్ 16న ముంబై నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న థానేకి బయలుదేరింది.
భారతీయ రైల్వే 1951లో జాతీయం చేయబడింది. భారతీయ రైల్వేలు నేడు ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. ఒకే సంస్థ నిర్వహణలో పనిచేసే రెండవ అతిపెద్ద నెట్‌వర్క్. ఇది ఒక ప్రపంచ రికార్డు. భారతీయ రైల్వే లైన్ల పొడవు 115,000 కి.మీ. రోజూ 23 మిలియన్ల మంది ప్రయాణీకులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చడానికి 12,617 రైళ్లను నడుపుతోంది. ఇది ఆస్ట్రేలియా మొత్తం జనాభాను తరలించడంతో సమానం. ఈ లైన్లు 7,172 కంటే ఎక్కువ స్టేషన్లను కలుపుతున్నాయి.
రైల్వేలు ప్రతిరోజూ 3 మిలియన్ టన్నుల (MT) సరుకు రవాణా చేసే, 7,421 కంటే ఎక్కువ గూడ్సు రైళ్లను నడుపుతున్నాయి. ఇది ఏటా ఒక బిలియన్ టన్నుల కంటే ఎక్కువ సరుకు రవాణా చేయడంతో సమానం. భారతీయ రైల్వేలో 239,281 సరుకు రవాణా వ్యాగన్లు, 59,713 ప్యాసింజర్ కోచ్‌లు మరియు 9,549 లోకోమోటివ్‌లు ఉన్నాయి.
రైల్వేల చరిత్ర:
భారత ప్రభుత్వం మొదటి నుండి రైల్వేలపై బలమైన ప్రభావాన్ని చూపింది. 1880, 1908 మధ్య రైల్వేలు పాక్షికంగా జాతీయం చేయబడ్డాయి, ఎందుకంటే అప్పటికే హామీ ఇవ్వబడిన రైల్వే కంపెనీలలో, భారత ప్రభుత్వం మెజారిటీ యాజమాన్య వాటాను కలిగి ఉంది. 1880కి ముందు ప్రైవేట్ యాజమాన్యం ఎక్కువ వాటాను కలిగి ఉండేవి. ప్రభుత్వాలు రైల్వేల అభివృద్ధిని ప్రోత్సహించాయి. వలస ప్రభుత్వం రైల్వే కార్యకలాపాలపై పూర్తి నియంత్రణను చేపట్టడంతో 1924, 1947 మధ్య దాదాపు పూర్తి జాతీయీకరణ జరిగింది.
భారతీయ రైల్వేల పనితీరును రెండు కాలాలుగా వర్గీకరించవచ్చు: 1920కి ముందు, 1920 తర్వాత. 1850, 1919 మధ్య ఉత్పత్తి, ఉత్పాదకత, లాభాలకు పెద్ద పీట వేయబడ్డది. కానీ 1920 తర్వాత ఈ ధోరణి తగ్గింది.
స్వాతంత్య్రానంతర కాలంలో, రైల్వేలు ప్రజా రవాణాలో 75%, సరుకు రవాణాలో 90% వాటా కలిగి ఉన్నాయి. అందుకే ప్రత్యేక బడ్జెట్ అవసరం పడ్డది.
రైల్వేలు మార్కెట్ ఏకీకరణను పెంచి, తద్వారా ఉత్పాదకతలోనూ, ఆదాయం పెరగటంలోనూ ప్రోత్సాహాన్ని అందించాయనటంలో ఎటువంటి సందేహమూ అవసరం లేదు. రైల్వే కార్యకలాపాల మొదటి దశాబ్దంలో ట్రాఫిక్ నెమ్మదిగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత ట్రాఫిక్ పెరుగుదల అధికారిక అంచనాలను కూడా మించిపోయి, సంబంధిత అధికారులను ఆశ్చర్యపడేట్లు చేసింది. భారతీయులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం కావల్సిన అవసరం వచ్చినప్పుడు రైళ్ల పైనే ఆధార పడటం మొదలు పెట్టారు. వస్తు రవాణాకు, ధాన్యం, ఇతర సరకులు రవాణా చేయడానికి రైల్వేలను ఉపయోగించారు.
1900లో సరుకు రవాణా పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని, రైల్వే ఆదాయం రూ.1.2 బిలియన్లు గానూ, జాతీయ ఆదాయంలో తొమ్మిది శాతంగానూ అంచనా వేశారు. 1870 నుండి 1913 వరకు 50 శాతం పెరిగిన వాస్తవ GDPని పరిగణనలోకి తీసుకుంటే రైల్వేల అంచనా ఆదాయం చాలా పెద్దది.
భారతదేశంలో రైల్వేలు సాపేక్షంగా పెద్ద ప్రభావాన్ని చూపించటానికి రెండు కారణాలు ఉన్నాయి. అప్పటి వరకూ ఉన్న రవాణా సాంకేతికత కంటే రైల్వేలు చాలా పెద్దవి. .ఎందుకంటే అప్పటివరకూ వాడబడిన రవాణా సౌకార్యం కేవలం ఎడ్ల బండ్లు మాత్రమే. ఇవి రైల్వేలకు ఏ విధంగానూ ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం కాదు. భారతదేశంలో విస్తృతమైన జలమార్గ నెట్‌వర్క్ లేదు. ఇంక భారతీయ రైల్వేలు ప్రారంభించబడిన తర్వాత అన్ని రంగాలూ అధిక స్థాయి ఉత్పాదక (TFP) వృద్ధిని చూశాయి. సాంకేతిక ఆవిష్కరణ వలన, ఆదాయం, పురోగతి అనేవి ఆ ఆవిష్కరణ యొక్క సామర్థ్యంలోని మెరుగుదల కారణంగా ఉంటుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం రైల్వే TFP వృద్ధి 1874 నుండి 1912 వరకు మొత్తం జాతీయ ఆదాయం తలసరి వృద్ధిలో 13 శాతానికి పైగా ఉంది.
రైల్వే వ్యవస్థ లేనప్పుడు రోడ్డు, జల రవాణాల ధరలు ఎంత ఉండేవో స్పష్టంగా తెలియదు. అంచనాలు కూడా సరిగా లేవు. పెరిగిన ట్రాఫిక్ పరిమాణంతో ఈ రెంటిపై కూడా రద్దీ పెరిగింది. ప్రత్యామ్నాయ రవాణా మోడ్‌లను పోల్చి చూడటం వల్ల, ఖర్చు .ఆయా సందర్భాలను బట్టి, రవాణా చేయవలసిన సరకు, ప్రదేశం వంటివి పరిగణనలోకి నిస్సందేహంగా తక్కువగా అంచనా వేయబడుతుంది. ఆదాయ గణన అనేది స్పిల్‌ఓవర్‌లను వదిలివేస్తుంది. రైల్వేలు ఇనుము, ఉక్కు కోసం తమ రవాణా ఖర్చుల డిమాండ్‌ను పెంచ వలసి వచ్చింది. ఇలా పెరిగిన ఆదాయం వలన నగరాల ఆవిర్భావం, నవీకరణ వంటి కార్యకలాపాలను వేగంగా పూర్తి చేయటానికి దోహద పడింది. భారతీయ నగరాలు ఇరవయ్యవ శతాబ్దం వరకు కూడా చాలా వైశాల్యంలో చిన్నవిగా ఉండేవి.
భారతీయ రైల్వేల ప్రాథమిక లక్ష్యం ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ వాణిజ్యాన్ని వృద్ధి చేయడం. భారత ప్రభుత్వం లాభాలపై చాలా శ్రద్ధ కనబరిచింది. సరుకు రవాణా ధరలు ప్రాథమికంగా సరైన స్థాయిలో నిర్ణయం చేయలేదు. ప్యాసింజర్ సర్వీసులపై కూడా తగిన శ్రద్ధ చూపలేదు. భారతదేశంలో ప్రజల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఛార్జీలు .విపరీతంగా ఉన్నాయి.
ముగింపు:
తొలి ఐదు దశాబ్దాలలో భారతీయ రైల్వే చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రాథమికంగా సరకు రవాణా కొరకు ప్రారంభించబడిన ప్యాసింజరు రైళ్లు కూడా అధిక లాభాలను ఆర్జించి పెట్టాయి. ఎన్నో సవాళ్లకు సమాధానాలు చెప్తూ ప్రస్తుతం భారతీయ రైల్వే ఈ స్థాయికి వచ్చింది. 1850 నుండి 1947 వరకు భారతదేశంలో రైల్వేల మౌలిక
సదుపాయాల అభివృద్ధి లో అత్యంత ముఖ్యమైన పాత్ర
పోషించాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటానికి, మార్కెట్‌లను
ఏకీకృతం చేయటానికి, వాణిజ్యాన్ని
పెంచటానికి రైల్వేలు
ప్రధాన పాత్ర పోషించాయి. రాజకీయాల పరంగా కూడా రైల్వేలు వలస ప్రభుత్వం, రాచరిక పాలనల ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి
మాత్రమే రూపొందించబడ్డాయి. అదే సమయంలో, భారతీయ రాజకీయాలు, రైల్వే యాజమాన్యం, విధానాలను ప్రభావితం చేశాయి, రైల్వేల
మొత్తం పనితీరును ప్రభావితం చేసింది. ఇరవయ్యవ శతాబ్దం పురోగమిస్తున్న కొద్దీ, భారత్ లోని రైల్వేలు
స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యానికి మారుపేరుగా
మారాయి.
