భారతీయ మధ్యతరగతి కుటుంబం. వారి ఆదాయం. (Bharateeya Madhyataragati kutumbam. Vari adayam) (Middle class family income in India):

 ప్రారంభం:

రాజీవ్ శుక్లా ఫౌండేషన్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే, మధ్యతరగతి యొక్క జీవనం భారత్ లో ఎలా కొనసాగుతోంది అనే అంశాన్ని ఆధారం చేసుకుని కొనసాగింది.ఈ సర్వే 2010 నాటిది. అయినా మనకు అందుబాటులో ఉన్న అతి పెద్ద మరియు అత్యంత విశ్వసనీయమైన సర్వే.

ఈ ఫౌండేషన్ సర్వే ప్రకారం ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క సంపాదన సాలీనా రెండు నుండి, పది లక్షల వరకూ ఉంటుంది. అదే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం సంవత్సర ఆదాయం తొంభై వేల నుండి, రెండు లక్షల వరకూ ఉంటుంది. నిజానికి మధ్యతరగతిని(Middle class in India)  సూత్రీకరించడానికి ఒక స్థిరమైన వాదం లేదు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ వద్ద నుండి, ఒక సామాన్యుడి వరకూ అందరూ మధ్యతరగతి వర్గీయులే.

ఎవరి లెక్క వారిది:

భారత దేశ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తనని తాను మధ్యతరగతి మహిళగానే అభివర్ణించుకున్నారు. దీనికి ఆమె చూపించిన సాక్ష్యం  తాను ఎలక్షన్ కమిషన్ కి సమర్పించిన ఆస్తుల అఫిడవిట్. సీతారామన్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తన వద్ద ఉన్న మూవబుల్ అసెట్స్ విలువ యాభై లక్షలుగా పేర్కొన్నారు. సంవత్సరాదాయం మధ్యతరగతి జీవనానికి సరిపడా ఉన్నట్లుగా పేర్కొన్నారు.  ఆమె సంవత్సరాదాయం ఇరవై నాలుగు లక్షలు.


కొన్ని ప్రైవేట్ సర్వేల ప్రకారం ఐదు నుండి ముప్ఫయి లక్షల సంవత్సర ఆదాయాన్ని(Annual income) కూడా మధ్యతరగతి కిందనే లెక్క కడుతున్నారు. దానికి వారు తీసుకున్న ప్రామాణికాలు, గ్రౌండ్ రిపోర్ట్ లు వేరుగా ఉంటాయి.ఒక కుటుంబంలో వ్యక్తులు నలుగురి నుండి, ఐదుగురు ఉంటారు. మెట్రో నగరాలలో 44%, మిగిలిన వారు పట్టణాలలోనూ, గ్రామాలలోనూ నివసిస్తున్నారు.



కొన్ని కంపెనీల ప్రకారం 7.5 నుండి 15 లక్షల వరకూ ఆదాయాన్ని మధ్యతరగతి కింద లెక్క కడుతున్నారు. కొన్ని కంపెనీలు 24 లక్షల వరకు కూడా మధ్యతరగతి కిందే లెక్క వేస్తున్నాయి.  Indian think tank ఐన ‘People Research on India's Consumer Economy (PRICE)’  లెక్కల ప్రకారం మధ్యతరగతి సంవత్సరాదాయం 30 లక్షల వరకూ ఉండ వచ్చు.


ఈ సర్వేలను వివిధ కంపెనీలు, సంస్థలు వారి వారి పాలసీలకు అనుగుణంగా నిర్వహించాయి. మాస్టర్ కార్డు(master card) వంటి క్రెడిట్ కంపెనీలు PEW రీసెర్చ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వంటి కంపెనీలు, సంస్థలు ఉన్నాయి.

దీనిని బట్టి భారత దేశంలో మధ్యతరగతి ప్రజలు వివిధ కంపెనీలు, ఏజన్సీల ద్వారా ఎన్ని రకాలుగా విభజించబడ్డారో అర్థమౌతుంది.

ముగింపు:

మధ్యతరగతి, మధ్యతరగతి ఆదాయం అన్న ఈ రెండు పదాలు నిజానికి పరస్పర విరుద్ధమైన పదాలు. ఒకదానికి ఒకటి కలిపి పోల్చి చదువుతే రెండవ దానికి అన్యాయం చేసిన వరమౌతాం. నిజానికి 7.5 లక్షల నుండి 15 లక్షల సంవత్సర ఆదాయాన్ని మధ్యతరగతిగా గుర్తించారు. అయితే 6 లక్షల నుండి 18 లక్షల వారిని కూడా నిర్వచన పరిగణనలోకి తీసుకుంటున్నారు. రెండూ పరస్పర విరుద్ధమైనవి. మధ్యతరగతి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది,. దిగువ మధ్యతరగతి మెల్లగా భారత్ లో మాయమౌతోంది. ఇప్పటికీ మధ్యతరగతి జీవనం నవ భారతాన్ని వదలటం లేదు. దేశం అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో మధ్యతరగతికి, మధ్యతరగతి ఆదాయానికి మధ్య అంతరం తగ్గించడం అన్నది చాలా ఆవశ్యకం.