భారత్, ఆఫ్రికా దేశాల సంబంధాలు ముఖ్యమా!(Bharat, Africa desala madhya sambandhalu):

 ప్రారంభం:

ఆఫ్రికా నిపుణుల బృందం ఒకటి "ఇండియా, ఆఫ్రికా భాగస్వామ్యం, విజయాలు, సవాళ్లు 2023" పేరుతో ఒక రోడ్ మ్యాప్ ను విడుదల చేసింది. భారతదేశం, ఆఫ్రికా సంబంధాలను మరింత లోతుగా అధ్యయనం చేయటానికి, మరిం2000 నుండి కూడా ఆఫ్రికా యొక్క అతిపెద్ద ఆర్థిక భాగస్వామి చైనా. ఇందులో సందేహమే లేదు. ఒక నివేదిక ప్రకారం చైనాను ఆఫ్రికా తమ మౌలిక సదుపాయాల డెవలపర్, వనరుల ప్రదాత, ఫైనాన్షియర్‌గా గుర్తించింది.

అయితే రోడ్ మ్యాప్ ప్రకారం భారతదేశం, ఆఫ్రికాతో గణనీయమైన భాగస్వామ్యాన్ని, సుసంపన్నమైన నిధిని కలిగి ఉంది. న్యూ ఢిల్లీ తన ఆఫ్రికా విధానాన్ని క్రమానుగతంగా నిరంతరం సమీక్షిస్తోంది.


ఘనా, నైజీరియా వంటి సహజ వనరులు అధికంగా ఉన్న దేశాల్లో కూడా భారతీయ సంస్థలు చురుకుగా పనిచేస్తున్నాయి. అగ్రిబిజినెస్, ఫార్మాస్యూటికల్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, ఎనర్జీ వంటి వ్యూహాత్మక రంగాలలో అనేక భారతీయ బహుళజాతి సంస్థలు తమ పెట్టుబడులను పెట్టాయి.
 సిఫార్సులు ఏమిటి:
ఇండియా, ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ ద్వారా రాజకీయ నాయకుల, బ్యూరోక్రాట్స్, వ్యవసాయం, టెక్నాలజీ, విద్య వంటి రంగాలలో నిపుణుల చేత శిఖరాగ్ర సమావేశాలను
మరిన్ని జరపాలి.
 
2023లో వార్షిక వ్యూహాత్మక మూసాయిదాను ప్రారంభించడం ద్వారా భారతదేశం, ఆఫ్రికన్ యూనియన్ మధ్య సహకారాన్ని మెరుగుపరచవచ్చు.
తీవ్రవాద వ్యతిరేకత, సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వంటి వ్యవహారాలలో సహకారాన్ని మరింత మెరుగుపరచాలి.
రక్షణ సమస్యలపై లోతైన ద్వైపాక్షిక ఒప్పందాలు జరగాలి. సముద్ర సహకారం ఇంకా విస్తృతం చేయాలి.
రక్షణ ఖర్చులను సులభతరం చేయడానికి క్రెడిట్ లైన్లను విస్తరింఛాలి.

ఆఫ్రికన్ గ్రోత్ ఫండ్ (AGF) సృష్టించడం ద్వారా ఫైనాన్స్ యాక్సెస్‌ను ప్రోత్సహింఛాలి.
ఎగుమతులను మెరుగుపరచడానికి, షిప్పింగ్ డొమైన్‌లో సహకారాన్ని పెంపొందించడానికి ప్రత్యేక ప్యాకేజీ రూపొంధించాలి.
ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడం, సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారాన్ని మరింత పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
భారతదేశం ఎంపిక చేసిన ఆఫ్రికన్ దేశాలలో విశ్వవిద్యాలయాలు, థింక్ ట్యాంక్‌లు, పౌర సమాజం, మీడియా సంస్థల మధ్య పరస్పర వాదం జరిగేలా చర్యలు తీసుకోవాలి.

విద్యను ప్రోత్సహించడానికి ఆఫ్రికన్ స్టడీస్ కోసం నేషనల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి.
ఉన్నత విద్య కోసం భారతదేశానికి వచ్చే ఆఫ్రికన్ విద్యార్థుల కోసం వీసా చర్యలను సరళీకరిం
ఛాలి.

 గాంధీనగర్ డిక్లరేషన్:

ప్రచ్ఛన్నయుద్ధం కాలంలో అనేక ఆఫ్రికన్ దేశాలతో పాటు ఇండోనేషియా, ఈజిప్ట్,  యుగోస్లేవియా వంటి దేశాలు కూడా నాన్ అలైన్‌మెంట్ ఉద్యమంలో చేరాయి. ఇండియా, ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ అనేది 2008 నుండి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆఫ్రికన్ భారతీయ సంబంధాలను తరచి చూసే అధికారిక వేదిక.భారతదేశం, ఆఫ్రికా వాణిజ్యం FY2223లో $98 బిలియన్లకు చేరుకుంది, ఇది అత్యంత సానుకూల ఆర్థిక అభివృద్ధి.గుజరాత్‌లోని గాంధీనగర్‌లో డిఫెన్స్ ఎక్స్పో 2022 సందర్భంగా డిఫెన్స్ ఇండియా, ఆఫ్రికా డిఫెన్స్  మధ్య ఒక ఆరోగ్యకరమైన భేటీ జరిగింది. శిక్షణ, సైనిక రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి 'గాంధీనగర్ డిక్లరేషన్' తన ఆమోదాన్ని తెలియజేసింది. 

ప్రాజెక్ట్ మౌసమ్:

“ప్రాజెక్ట్ 'మౌసమ్”' అనేది భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క చొరవతో ఏర్పడిన సంస్థ. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న దేశాలను బహుముఖంగా ప్రోత్సహించడంలోనూ, కొత్త అభివృద్ధి మార్గాలను  అన్వేషించడం లోనూ వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. సముద్ర మార్గాల అధ్యయనానికి సంబంధించిన పరిశోధనలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈజిప్ట్, కెన్యా, సూడాన్, సోమాలియా మొదలైన ఆఫ్రికా దేశాలను సభ్యులుగా కలిగి ఉన్న ఈ ప్రాజెక్ట్ కి, దాదాపు 39 ఇతర హిందూ మహాసముద్ర దేశాలు కూడా ఎంపిక చేయబడ్డాయి.

ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ITEC) అనేది  భారతదేశం యొక్క ఫ్లాగ్‌షిప్ కెపాసిటీని బిల్డ్ చేసే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో లబ్ధి పొందుతున్న దేశాలలో ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి.

భారత్ అందిస్తున్న ఇతర సహాయాలు:

భారత జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాల ప్రకారం, భారతదేశం వెలుపల మొట్టమొదటి IIT క్యాంపస్ టాంజానియాలోని జాంజిబార్‌లో ఏర్పాటు చేయబడింది. దీని ద్వారా టాంజానియా కూడా అక్టోబర్ నుండి IIT స్థాయి విద్యా ప్రమాణాలను పొందవచ్చు. భారతదేశం "ఒక భూమి ఒక ఆరోగ్య మిషన్" స్కీమ్ కింద 42 ఆఫ్రికన్ దేశాలకు 'మేడ్ ఇన్ ఇండియా,' కోవిడ్ వ్యాక్సిన్‌”లను సరఫరా చేసింది. పాన్ ఆఫ్రికన్, ఇ-నెట్‌వర్క్ ద్వారా ఆఫ్రికన్ దేశాలకు ఉపగ్రహ కనెక్టివిటీ, టెలి ఎడ్యుకేషన్, టెలి మెడిసిన్ సేవలను అందించే లక్ష్యంతో భారతదేశం, ఆఫ్రికన్ యూనియన్ ను తన ఉపగ్రహ సేవలను అందిస్తోంది.

ముగింపు:

ఆఫ్రికాతో, వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించడానికి లేదా సముచితస్థానాన్ని ఏర్పరచుకోవడానికి భారత్‌కు స్పష్టమైన అవకాశం ఉంది. ఆఫ్రికాకు సంబంధించినంత వరకూ న్యూ ఢిల్లీ ఒక స్పష్టమైన వ్యూహాన్ని కలిగి ఉన్నది. ప్రభుత్వం, ప్రైవేట్ లేదా హైబ్రిడ్ మోడల్ ద్వారానైనా ఆఫ్రికాను పటిష్ట పరచడానికి, తన విదేశాంగ విధానాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి భారత్ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నది. మొదటగా చైనాను అడ్డుకోవటం, ఇతర దేశాల నుండి వస్తున్న పోటీని ఎదుర్కొని తన సహాయ సహకారాలను కొనసాగించడం ప్రస్తుతం భారత్ ముందున్న ప్రధాన సవాళ్ళు.


: