భారత దేశ అభివృద్ధి. ప్రపంచ అభివృద్ధి.(Bhaarat abhivruddhi. prapancha abhivruddhi. When India grows, the whole world grows):

 పరిచయం:

న్యూఢిల్లీ, నేడు ప్రపంచ వేదికపై కొత్త స్వరాన్ని వినిపిస్తోంది. విధి విధానాలలో వచ్చిన మార్పులను  స్పష్టంగా ప్రపంచం ముందు ఉంచుతోంది. భారతదేశం త్వరలో ప్రపంచ ఆర్థిక సూపర్ పవర్ అవుతుంది. రాబోయే 25 సంవత్సరాలలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా వేయబడింది. ఇప్పటికే చైనాను అధిగమించి, ప్రపంచంలోనే అతిపెద్ద జనాభాగా అవతరించింది. ప్రపంచంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయుడే.

విధానాలలో విప్లవాత్మకమైన మార్పు:
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ముగిసిన మూడు దేశాల పర్యటన, న్యూఢిల్లీకి పెరుగుతున్న పలుకుబడికి నిదర్శనం. G7లో ప్రధాని మోదీ హాజరుకావడం, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సమావేశం,
 


క్వాడ్ కనెక్షన్, దక్షిణ పసిఫిక్‌కు చేరుకోవడం, ఆస్ట్రేలియాతో సంబంధాలను పటిష్టం చేసుకోవడం, ఇవన్నీ న్యూఢిల్లీ ప్రపంచ రాజకీయ అల్లకల్లోలాన్ని సమర్థవంతంగా నిర్వహించాయనడానికి ఉపయోగకరమైన రిమైండర్‌. అదే సమయంలో భారత్, భవిష్యత్తు కోసం తనను తాను సర్వసన్నద్ధంగా ఉంచుకుంటోంది. శ్రీనగర్‌లో జరిగిన G20 సమావేశాన్ని భారతదేశం ఆర్భాటంగావిజయవంతంగా ముగించడం, విధానపరమైన సమస్యలను కూడా నావిగేట్ చేయగల సామర్థ్యంపై ప్రభుత్వం యొక్క పెరుగుతున్న విశ్వాసానికి సంకేతం. గత తొమ్మిదేళ్ల ప్రభుత్వ విదేశాంగ విధానానికి ఇదే అచ్చమైన ప్రతిబింబింబం. ఇక వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం. 2014లో తన పదవీకాలం ప్రారంభం నుండి, ప్రస్తుతం వరకూ గమనిస్తే, మోడీ విప్లవాత్మక నాయకుడిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారా అనే చర్చ సజీవంగా ఉండేట్లు చేశారు. యూరప్ నుండి ఇండో-పసిఫిక్ వరకు, యురేషియా నుండి ఆఫ్రికా వరకు భారత దేశం ప్రపంచ అవసరాలను తీర్చేందుకు అవసరమైనదిగా ప్రస్ఫుటంగా అగుపడుతోంది. 

పెద్దన్న పాత్ర:

 కార్యాచరణపరంగా, బాధ్యతాయుతమైన ప్రపంచ వాటాదారుగా తన వంతు పాత్రను పోషించడానికి న్యూఢిల్లీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే ముఖంగా భారత్ వర్ధిల్లుతోంది. పర్యావరణం కోసం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ మైత్రి వరకు భారతదేశం కొన్ని సంవత్సరాల క్రితం ఊహించని విధంగా ప్రపంచ పాలనకు సహకరిస్తోంది.
 అంతర్జాతీయంగా జరుగుతున్న మార్పులు భారతదేశానికి కొత్త అవకాశాలను తెరిచాయి. భారతీయ విధాన రూపకర్తలు ఈ అవకాశాలకు విరివిగానూ, ఒడుపుగానూ అందిపుచ్చుకున్నారు. ప్రపంచ సమతుల్యత, ప్రధాన శక్తుల మధ్య కొత్త లోపాలను సృష్టిస్తోంది. రష్యా, పశ్చిమ దేశాల సంబంధాలు నకారాత్మకమైన మలుపు తీసుకున్న సమయంలో యుఎస్, చైనాల పోటీ తీవ్రమైన రూపాన్ని సంతరించుకుంది. సాధారణంగా, భారతదేశం వంటి శక్తి ఇటువంటి సమాయంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి కోసం దృష్టి సారించి ఉంచాలి. కానీ సంప్రదాయ విధానాలకు విరుద్ధంగా,  భారత్ తన  దౌత్య విధానాన్ని వృద్ధి చేసుకుంది. ఉక్రెయిన్ సంక్షోభం సందర్భంలో భారతీయను కుదించే బదులు, ప్రపంచ వేదికపై న్యూఢిల్లీ స్వరాన్ని మరింత బలంగా వినిపించింది. చైనా ప్రవర్తన, దాని విదేశాంగ విధానం పైన పాశ్చాత్య దేశాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న తరుణంలో, భారత్, చైనాకు ప్రత్యామ్నాయంగా అతి త్వరగా ఎదగగలిగింది. గ్లోబల్ దౌత్యాన్ని చాలా డైనమిక్ స్వీకరించింది. ఇటీవలి చరిత్రలో అత్యంత క్లిష్ట సమయాల్లో భారతదేశాన్ని సమర్థవంతంగా నడిపించినందుకు, నిండైన భారతీయతను ప్రదర్శించి, ఆందోళనలకు గొంతుగా నిలవడంలో కృతకృత్యమైంది. ప్రస్తుతం భారతీయత, అంతర్జాతీయ వ్యవస్థలో అన్ని చోట్లా వినిపిస్తోంది. విమర్శ చాలా అవసరం. ఇక్కడా విమర్శకులు ఉన్నారు. అయితే వారిని మించిన వాణిని ప్రస్తుతం భారత్ వినిపిస్తోంది.

యుఎస్, ఇండియా వాణిజ్యం:
 యుఎస్-ఇండియా వాణిజ్యం పెట్టుబడి భాగస్వామ్యం ప్రపంచ వృద్ధికి ఒక ఇంజిన్ వంటిది. 2022లో ద్వైపాక్షిక వాణిజ్యం USD 191 బిలియన్లకు చేరింది. 2014 నాటి నుండి చూసుకుంటే ప్రస్తుతం దాని విలువ రెట్టింపుకు పైనే ఉంది.
 ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ పార్టనర్‌షిప్ డైలాగ్‌లో యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య చురుకైన భాగస్వామ్యం కొనసాగుతోంది. ఇరువైపులా  నాయకులు దీనికి మద్దతు కొనసాగిస్తున్నారు.
అమెరికాలో భారతీయ పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యాసంస్థల మధ్య ఎక్కువ సాంకేతికత భాగస్వామ్యం ఉండేట్లుగా ఒప్పందాలు కుదిరాయి. అభివృద్ధి, ఉత్పత్తి అవకాశాలను సులభతరం చేసే విధానాలను ప్రోత్సహించడానికి నిబంధనలను క్రమబద్ధీకరించడానికి ప్రధాని మోదీ, అధ్యక్షుడు బిడెన్ కట్టుబడి ఉన్నారని ఒక సంయుక్త
ప్రకటన పేర్కొంది.



బోయింగ్‌తో 200కు పైగా యుఎస్ తయారీ విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్ ఇండియా చేసుకున్న  చారిత్రాత్మక ఒప్పందాన్ని మోదీ, బిడెన్ స్వాగతించారు. ఈ కొనుగోలు, 44 రాష్ట్రాలలో ఒక మిలియన్ కంటే ఎక్కువ US ఉద్యోగాలకు మద్దతునిస్తుందని, భారతదేశంలో పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలకు దోహదం చేస్తుందని సంయుక్త ప్రకటన పేర్కొంది.

ముగింపు:

 వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరచడానికి, పెట్టుబడుల కోసం కొత్త ప్రాంతాలను గుర్తించడానికి ఈ ఏడాది చివర్లో భారతదేశం, యుఎస్ ట్రేడ్ పాలసీ ఫోరమ్‌ను తిరిగి సమావేశపరచడానికి తాము నిర్ణయించినట్టు భారతదేశం,  యుఎస్ తెలిపాయి.