ఇండియా ><ఎన్డీయే@2024( I.N.D.I.A vs. NDA@2024):

 ప్రారంభం:

2024లో భారత్ లో సార్వత్రిక ఎన్నికలు:

న్యూఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగాయి. ప్రధాని నరేంద్ర మోదీపైనా, ఆయన ప్రభుత్వంపైనా విపక్షాలు తీవ్రమయిన ఒత్తిడి తెచ్చాయి.

 భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం ఆద్వర్యంలోని ప్రభుత్వం అధిక ధరలు, ద్రవ్యోల్బణం, ఆందోళనలు, నిరసనలు, తీవ్రమైన బాహ్య భద్రతా సమస్యలు, నిరుద్యోగం వంటివి ఎదుర్కుంటోంది.

 2020 శీతాకాలంలో రైతులు ఢిల్లీ సరిహద్దుల వద్ద ఆందోళన చేశారు.


పెగాసస్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించారనే ఆరోపణలపై తీవ్రమైన స్నూపింగ్ ఆరోపణలు అధికార పక్షం ఎదుర్కొంది. ఫలితంగా పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ప్రతిపక్షాలచే బహిష్కరణ జరిగింది.

ఆ సందర్భంగా వివిధ పార్టీల అధినాయకులు ఢిల్లీ లో హడావుడి చేశారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం జనరల్ ఎలక్షన్ ల సమయంలో తమ ఉనికిని చాటుకునేందుకు ఇది ఒక మార్గమని ఆయా పార్టీల నాయకులు నమ్మటమే దీనికి కారణం. వారి  పర్యటనలను పత్రికలు కవర్ చేసిన తీరు, కాంగ్రెస్ పార్టీ సారధిగా రాహుల్ గాంధీని కలవరపెట్టి ఉండవచ్చు.



ఇది బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు నాయకుడిగా ఎవరు ఉండాలనే చర్చకు కూడా దారితీసింది. దీనికి జవాబు వెతకటం కష్టతరమైనప్పటికీ వర్తమానంలో మాత్రం భారతదేశంలో ప్రాముఖ్యత కలిగిన ప్రశ్న.
 శరద్ పవార్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలు రచించడంలో చురుకుగా పాల్గొంటున్నారు.
 లెక్కలు:
 శరద్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి కేవలం 5 సీట్లు, మమతా బెనర్జీకి చెందిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కి 22, కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత పార్లమెంట్‌లో బీజేపీకి 301 సీట్లు వచ్చాయి.
దీన్నిబట్టి మోడీని ఓడించడం అంత తేలిక కాదని అర్థమవుతుంది.
 మరోవైపు ప్రతిపక్షాల ఎజెండాను ఎదుర్కోవడానికి ఎన్డీయేకు 38 రాజకీయ పార్టీల బలం ఉన్నది. లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న బీజేపీ, 543 స్థానాలకు గానూ 303 సీట్లను గెలుచుకుంది. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నకాషాయ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 350 సీట్లపై కన్నేసింది.
 ఎవరెట్లా?:
లోక్‌సభ ఎన్నికల్లో NDA కి ఎదురుగా I.N.D.I.A
ఉంది.



ఈ కూటమి మనుగడ తమ తమ రాజకీయ అవసరాల కోసం అన్ని పార్టీలకు, ఆయా పార్టీల అధినాయకులకు చాలా ముఖ్యమైన వ్యవహారం. బిజెపి బలాన్ని తాము ఒంటరిగా ఎదుర్కొలేమని ప్రతిపక్ష పార్టీలకు తెలుసు. దీనికి ఏకైక పరిష్కారం జాతీయస్థాయిలో అన్నీ పార్టీలు కలిసి రావడమే. రాష్ట్ర స్థాయి రాజకీయాలలో మాత్రం ఈ పార్టీలు పరస్పరం పోటీ పడతాయి. 2019 లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే, 190 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ జరిగింది. ప్రాంతీయ పార్టీలు, ఇతర మిత్రపక్షాలు ప్రభావం చూపలేదు. 19 స్థానాల్లో, రెండవ రన్నరప్‌కు గెలుపు మార్జిన్ కంటే కొంత మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
 అధికార బిజెపి బలాన్ని, ప్రతిపక్షాలుగా తాము చేజిక్కించుకునేందుకు గానూ, ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్‌ ఏర్పాటు చేసినప్పటికీ, భాగస్వాముల ఉమ్మడి కార్యక్రమాన్ని స్నేహపూర్వకంగా కలిసికట్టుగా నడపటం సవాలుగా మారింది. ఐతే కలిసి పోరాడటం సాధ్యమే అని  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కలిసి పోరాడతాయని ఆమె ఉద్ఘాటించారు.
 వచ్చే ఎన్నికల్లో భాజపా గెలిస్తే భారత్‌కు ఉనికి ఉండదు, ఇక ఎన్నికలు కూడా ఉండవని ఆమె హెచ్చరించారు. విపక్షాలు తమలోని సమస్యలను పరిష్కరించుకుంటూ మరికొన్ని మిత్రపక్షాలను చేర్చుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ(ఎం), తృణమూల్‌ కాంగ్రెస్‌, కేరళలో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్‌, కాంగ్రెస్‌ వంటి రాష్ట్రాల్లో తీవ్ర ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్షం వైపు ఉన్న పార్టీల సంఖ్య, పాట్నాలో 16 గా ఉండగా అది  బెంగళూరులో 26కి పెరిగింది. ఆ కూటమికి పెట్టబడిన కొత్త పేరు ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్). త్వరలో సమన్వయ కమిటీ, కన్వీనర్, ఉమ్మడి కనీస కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
 
అకస్మాత్తుగా ఇరువైపులా వీలైనంత ఎక్కువ మంది మిత్రపక్షాలను తమలో కలుపుకుని, పై చేయిని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ఆతృత స్పష్టంగా కనిపిస్తోంది. రెండు పెద్ద పార్టీలు కూడా చిన్న పార్టీలతో సమన్వయం ఏర్పాటు చేసుకునే మూడ్‌లో ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పోటీ కొంత కాలానికి పక్కన పెట్టాయి. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల రణరంగాన్ని మించిపోయింది.
 కూటములు:
 నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) జూలై 18న తమ సమావేశానికి 38 పార్టీలకు రెడ్ కార్పెట్ పరిచింది.
 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కొన్ని పార్టీల గురించి విని కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి కూడా ఒక్క మనిషిని ఓడగొట్టే పరిస్థితి లేదు. రెండు వైపులా కూడా స్వాగత బోర్డులు విరివిగా దర్శనమిస్తున్నాయి. 2024 యుద్ధం రూపుదిద్దుకుంటోంది. రాజకీయ చిన్న, పెద్ద ఆటగాళ్లు తమ పక్షాలను ఎంచుకుంటున్నారు.

కింగ్ మేకర్స్:
 సార్వత్రిక ఎన్నికల రూపురేఖలు విశాలంగా మారిపోతున్నాయి. ఓటు కోసం యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఇక్కడే నాన్-అలైన్డ్ ప్లేయర్‌ల(USP) తమ యుక్తిని అమలులోకి తెస్తారు. ఆయా రాష్ట్రాల్లో మూడు బలమైన పార్టీలయినటువంటి తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (BRS), ఆంధ్రప్రదేశ్‌లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP), ఒడిశాలో బిజూ జనతాదళ్ (BJD)
కింగ్‌మేకర్‌లుగా ఎదగవచ్చు.



బిజెపి పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సమావేశాన్ని నిర్వహించింది.
 NDAలో 38 పార్టీలు ఉన్నాయి, వీటిలో చాలా చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. అవి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పరిమిత ఉనికిని కలిగి ఉన్నాయి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూటమిగా NDA తన ప్రాభవాన్ని కోల్పోయింది. 2019లో తిరిగి ఎన్నికైనప్పటినుండి, ప్రధాని  బిజెపిని బలమైన విజయాల వైపు నడిపించాడు. కూటమిలో  భాగస్వాముల ప్రభావాన్ని తగ్గించాడు.

 అయితే ఎన్నికల వేళ బీజేపీ తన కూటమిని తిరిగి బలంగా ముందుకు తీసుకువస్తోంది.

ముగింపు:

ఎన్నికల పండుగ దగ్గరౌతున్న కొద్దీ, అధికార పక్షం, ప్రతిపక్షం ఎదురుబొదురు కదన రంగంలోకి దిగుతున్నాయి. ఆరోపణాలూ, ప్రత్యారోపణాలూ సాధారణమైపోయాయి. ఇక్కడ సగటు జీవి ఆలోచించవలసిన విషయం ఒక్కటే. ఎట్టి పరిస్థితులలోనూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. జనరల్ ఎలక్షన్స్ కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ చాలా వరకు రాష్ట్రాలలో ఓటు శాతం 30 నుండి 35 శాతం మించట్లేదు. ఈ ఉదాసీనత అసలు పనికి రాదు.